Begin typing your search above and press return to search.

సంక్రాంతి బరిలోకి మలయాళ స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   22 Dec 2021 3:31 PM GMT
సంక్రాంతి బరిలోకి మలయాళ స్టార్ హీరో..!
X
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'ఓకే బంగారం' 'మహానటి' 'కనులు కనులను దోచాయంటే' 'కురుప్' వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. ఈ క్రమంలో టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన దుల్కర్.. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ త్రిభాషా చిత్రం చేస్తున్నారు.

అలానే డ్యాన్స్ మాస్టర్ బృంద డైరెక్షన్ లో నటించిన 'హే సినామిక' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే క్రమంలో లేటెస్టుగా DQ నటించిన ''సెల్యూట్'' అనే మరో మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

దుల్కర్ సల్మాన్ తొలిసారిగా పోలీస్‌ గా నటించిన చిత్రం ''సెల్యూట్''. కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని 2022 జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మలయాళ హీరోకి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఈ మూవీని ఇక్కడ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే సంక్రాంతి బరిలో 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటుగా 'బంగార్రాజు' కూడా దిగుతోంది. ఇలాంటి పోటీ మధ్య 'సెల్యూట్' వంటి డబ్బింగ్ సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమే. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, 'సెల్యూట్' చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిచారు. వేఫేరర్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ స్వీయ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది. బాబీ - సంజయ్ కథ అందించారు. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. రాజకీయ రంగు పులుముకున్న ఓ హత్య కేసును ఓ పోలీస్ ఆఫీసర్ య్ఎలా ఛేదించాడనేదే కథాంశం.

ఇందులో అరవింద్ కరుణాకరన్ అనే పోలీస్ గా దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ డయానా పెంటీ హీరోయిన్ గా కనిపించనుంది. మనోజ్ కె జయన్ - సానియా అయ్యప్పన్ - సాయి కుమార్ - లక్ష్మీ గోపాలస్వామి - విజయ్ కుమార్ - గణపతి పొదువాల్ - అలెన్సియర్ లే లోపేజ్ - బిను పప్పు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేక్స్ బేజాయ్ సంగీతం సమకూర్చగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.