Begin typing your search above and press return to search.

సల్మాన్ ఆ ముగ్గురిని జీవితాంతం మరిచిపోలేడట..

By:  Tupaki Desk   |   7 Jun 2022 1:30 AM GMT
సల్మాన్ ఆ ముగ్గురిని జీవితాంతం మరిచిపోలేడట..
X
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశమంతా అభిమానులు ఉన్న ఒకే హీరో సల్మాన్ ఖాన్. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ ఇప్పటికీ.. ఎప్పటికీ యంగ్ హీరోగానే కొనసాగుతున్నాడు. నాటి నుంచి నేటి వరకు ఆయన సినిమా వచ్చిందంటే చాలు.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ థియేటర్ల వద్ద సందడిగా ఉంటుంది. ఈమధ్య సల్మాన్ సినీ ఫంక్షలకు బాగా అటెండ్ అవుతున్నారు.

మొన్న ట్రిపుల్ ఆర్ సినిమాలో సల్మాన్ గెస్టుగా వచ్చి అలరించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించారు. వారి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సల్మాన్ ఎమోషనల్ కావడంతో అక్కడున్నవారే కాకుండా వీడియో చూసినవారంతా షాక్ అయ్యారు. ఇంతకీ సల్మాన్ కంట్లో నీళ్లు తెప్పించిన ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం..

సునీల్ శెట్టి..:

సల్మాన్ తో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సునీల్ శెట్టి.. అయితే సునీల్ శెట్టి సల్మాన్ రాకముందే స్టార్ హీరో. సల్మాన్ వద్ద ఒకప్పుడు డబ్బులు లేని సమయంలో అనుకోకుండా షాపింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో మార్కెట్లోకి కొత్త ఫ్యాషన్ డ్రెస్ వచ్చిందన్నారు. దాన్ని చూడగానే బాగా నచ్చిందని, కానీ తన దగ్గర జీన్స్ కొనడానికి మాత్రమే డబ్బుందని అన్నారు.

షర్ట్ కొనేంత సొమ్ము లేకపోవడంతో దానిని అక్కడే వదిలేసి వచ్చానన్నారు. ఆ సయంలో సునీల్ శెట్టి నాతో ఉన్నాడు. ఒకసారి తన ఇంటికి వెళ్లినప్పుడు అదే షర్ట్ ను నాకు బహుతిగా ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. నా లైఫ్లోనే ఇది అతిపెద్ద గిఫ్ట్ అని సల్మాన్ బావోద్వేగానికి గురయ్యాడు.

రమేశ్ తౌరానీ:

మైనేఫ్యార్ కియా సినిమా సల్మాన్ కెరీన్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ తోనూ ఓ అనుబంధం ఉండేదని సల్మాన్ చెప్పాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలో భాగ్యశ్రీ ఈ సినిమా తరువాత మళ్లీ నటించనని చెప్పిందన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె వివాహం చేసుకోవాలనుకుందని చెప్పారు. దీంతో నాకు ఆ సమయంలో సినిమాలేవీ లేవన్నారు. మా నాన్నగారు ఓ పత్రికలో ప్రకటన ఇచ్చాడన్నారు. నిర్మాత జి.పి. సిప్పీతో సినిమా చేస్తున్నాడని ఇందులో సారాంశం. అయితే ఈ యాడ్ ఆధారంగా రమేశ్ తౌరానీ సీపీ సాబ్ ఆఫీసుకెళ్లి సినిమా మ్యూజిక్ కోసం రూ.5 లక్షలు చెల్లించాడన్నారు. దీంతో నాకు పత్తర్ సినిమాలో అవకాశం వచ్చిందన్నారు.

బోనికపూర్:

తన జీవితంలో మరో అరుదైన వ్యక్తి బోనీ కపూర్ అని సల్మాన్ వివరించాడు. బోనీ కపూర్ తనకు జీవితాంతం సాయం చేశాడని అన్నారు. కెరీర్ కష్ట కాలంలో ఉన్నప్పుడు బోనీ కపూర్ వాంటెడ్ సినిమాలో అవకాశం ఇచ్చాడని అన్నారు. అయితే నాకు నో ఎంట్రీ సినిమా చేద్దామనుకున్నా.. అనిల్ కపూర్ ను తీసుకు వచ్చేందుకు నాకు అవకాశం ఇచ్చాడని అనడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.