Begin typing your search above and press return to search.
టైగర్ 3 లాంచింగ్ వేళ ఉరకలెత్తుతున్న భాయ్
By: Tupaki Desk | 21 Jan 2021 12:00 PM ISTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధే (పోస్ట్ ప్రొడక్షన్).. యాంటీమ్ చిత్రాలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో `కబీ ఈద్ కబీ దీపావళి` చిత్రీకరణను ప్రారంభించనున్నారు.
దీంతో పాటే.. మరో ఆసక్తికర వార్త అభిమానుల్లో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. సల్మాన్ మార్చి నెల నుండే ఎక్ థా టైగర్ మూడవ భాగం చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ వరకు సల్మాన్ చేయనున్నట్లు సమాచారం.
టైగర్ 3 టైటిల్ తో ఈ మూవీని ప్రఖ్యాత యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. కత్రినా కైఫ్ కథానాయికగా నటించనుంది. టైగర్ సిరీస్ లో రెండు సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాల్ని సాధించడంతో మూడో భాగంపైనా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏడాది కాలంగా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ స్క్రిప్టును రెడీ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు కత్రిన స్నేహితుడు జాఫర్ తనని సూపర్ గాళ్ పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తుండడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.