Begin typing your search above and press return to search.

బురఖా తొడిగి సల్మాన్‌ కామెడీ

By:  Tupaki Desk   |   15 July 2015 7:47 AM GMT
బురఖా తొడిగి సల్మాన్‌ కామెడీ
X
సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా భజరంగి భాయిజాన్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కబీర్‌ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈనెల 17న రిలీజవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో భజరంగి ఫీవర్‌ మొదలైంది. అక్కడ ఓ వైపు బాహుబలి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంటే పోటీలోకి వస్తున్నాడు సల్మాన్‌. అంతేనా ట్రైలర్‌ ఇప్పటికే లక్షలాది జనాల్ని ఆకట్టుకుంది.

అందులో సల్మాన్‌ బురకా తొడిగి ఓ చిన్నారిని రక్షించే తీరు ఎంతో ఆకట్టుకుంటోందని అభిమానులు అంటున్నారు. కాశ్మీర్‌కి చెందిన ఓ చిన్నారి బార్డర్‌లో తప్పిపోతుంది. అప్పుడు ఆ చిన్నారిని పాకిస్తాన్‌ సైన్యం బారి నుంచి కాపాడడానికి సల్మాన్‌ ఎలాంటి ఎత్తుగడలు వేశాడన్నదే సినిమా. తన భారీ పర్సనాలిటీని చెక్‌పోస్టుల్లో గుర్తు పట్టకుండా బురఖా ఒకటి ధరిస్తాడు సల్లూభాయ్‌. అందులో బోలెడంత ఫన్‌ పండించాడని చెబుతున్నారు. ఇదే చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, కరీనకపూర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రంలో సల్మాన్‌ క్యారెక్టర్‌ పేరు పవన్‌. ఈ పాత్రలో సల్మాన్‌ ఫీట్స్‌ అసాధారణంగా ఉంటాయని చెబుతున్నారు. పవర్‌ ఫేం రాక్‌లైన్‌ వెంకటేష్‌ ఈ చిత్రాన్ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌తో కలిపి రిలీజ్‌ చేస్తున్నారు.