Begin typing your search above and press return to search.

రయీస్‌ వర్సెస్‌ సుల్తాన్‌.. వార్‌ స్టార్ట్‌

By:  Tupaki Desk   |   23 Jun 2015 4:38 PM GMT
రయీస్‌ వర్సెస్‌ సుల్తాన్‌.. వార్‌ స్టార్ట్‌
X
ఈ పేర్లు చాలా కొత్తగా ఉన్నాయ్‌ కదూ. బాలీవుడ్‌లో అంతేనండి.. ఏదైనా రెండు సినిమాల మధ్యన వార్‌ స్టార్ట్‌ చేయాలంటే మనోళ్ళకు మనోళ్ళే సాటి. ఆలూ లేదూ చూలూ లేదూ కొడుకు పేరు లలిత్‌ మోడీ అంటూ మనం సామెతను చెప్పుకుంటుంటాం. కాని వారు మాత్రం నిజంగానే ఆలూ చూలూ లేకుండా కొడుకు పేరుతో నవగ్రహపూజ చేయించి ఫస్ట్‌ బర్త్‌డే ట్రీట్‌ ఎప్పుడో ప్రకటించేస్తారు.

ఇంకా ఈ సంవత్సరం రంజాన్‌ పండుగ రానేరాలేదు. వచ్చే నెల 18న ఆ పండుగ. ఆ రోజు సల్మాన్‌ ఖాన్‌ 'బజరంగీ భాయిజాన్‌' సినిమా విడుదలవుతోంది. ఇక దీపావళికి... అంటే అక్టోబర్‌ 18న షారూఖ్‌ ఖాన్‌ 'దిల్‌వాలే' సినిమా వస్తోంది. కాని 2015లో వస్తున్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన విషయాలను డిస్కస్‌ చేయడం మానేసి.. మన బాలీవుడ్‌ బాబులు 2016 కోసం అప్పుడే బ్యాటింగ్‌ స్టార్ట్‌ చేశారు. వచ్చే సంవత్సరం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌ నెల ఆఖరి రోజు పండుగ)కు సల్మాన్‌ తన ''సుల్తాన్‌''తో వస్తున్న డేట్‌ ప్రకటించాడు. ఇక షారూఖ్‌ కూడా అపుడే ''రయీస్‌'' సినిమాతో రావడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అంటే కరెక్టుగా ఇంకో సంవత్సరం తరువాత అనమాట. ఫ్యాన్స్‌ మాత్రం మా సినిమా గొప్పంటే మాది గొప్ప అని ఇప్పటినుండే కొట్టుకుంటున్నారు. ఈ రెండు సినిమాలో కేవలం ఓ రెండు రోజుల మాత్రమే ఇప్పటివరకు నామమాత్రపు షూటింగ్‌ చేశాయ్‌. అది సంగతి.