Begin typing your search above and press return to search.

టీజర్‌ టాక్‌: ఈసారి దుమ్ములేపుతున్నాడు

By:  Tupaki Desk   |   12 April 2016 10:33 AM GMT
టీజర్‌ టాక్‌: ఈసారి దుమ్ములేపుతున్నాడు
X
అయితే ప్రతీసారి ఇరగదీశాడు అనే పదానికి ప్రత్యామ్నాయంగా దుమ్ములేపుతున్నాడు అని చెబుతుంటాం. కాకపోతే ఈసారి నిజంగానే సల్లూ భాయ్‌ దుమ్ములేపాడు. అయితే అది ఇరగదీసిందా లేదా అనేది మాత్రం చెప్పలేం.

ఈ సంవత్సరం రంజాన్‌ పండుగకు.. ''సుల్తాన్‌'' సినిమాతో వస్తున్నాడు సల్మాన్‌ ఖాన్‌. మామూలుగా ఎప్పుడూ విపరీతమైన హీరోయిక్‌.. లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ పాత్రలను చేసే సల్మాన్‌ ఖాన్‌.. ఇప్పుడు మాత్రం ఒక కుస్తీదారుడి పాత్రలో నటిస్తున్నాడు. అబ్బాస్‌ ఆలీ జాఫర్‌ డైరక్షన్‌ లో చేస్తున్న ఈ సినిమాలో మనోడితో పాటు హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా వ్రెజ్లర్‌గానే నటిస్తోంది. ఇక టీజర్ విషయానికొస్తే.. హర్యానాలో.. బరిలోకి దిగుతున్న సుల్తాన్‌ అనే కుస్తీ పోటీదారుడుగా సల్మాన్‌ ను ఇంట్రొడ్యూస్‌ చేశారంతే.

దుమ్మురేపిన ఈ టీజర్‌ చూసి బాలీవుడ్‌ అంతా సూపర్‌ అంటున్నారు..మరి సినిమాలో కంటెంట్‌ ఎలా ఉండబోతోందో చూడాలి.