Begin typing your search above and press return to search.

క్వారంటైన్‌ లోనూ సల్లూ భాయ్ ని వదలని స్టార్ హీరోయిన్...

By:  Tupaki Desk   |   27 March 2020 10:00 PM IST
క్వారంటైన్‌ లోనూ సల్లూ భాయ్ ని వదలని స్టార్ హీరోయిన్...
X
కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమకు లభించిన సమాయాన్ని గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగులు లేక ఖాళీగా ఉండటం తో కావాల్సినంత టైం దొరికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు. ముంబైకి సమీపంలోని పాన్వెల్ ఫాంహౌస్‌ లో కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నాడు. తన వెంట సోదరి అర్పితా శర్మ, బావ ఆయుష్ శర్మ‌తో పాటు వారి పిల్లలు ఆహిల్, ఆయత్‌ కూడా ఉన్నారు. అయితే షాకింగ్‌గా ఫాంహౌస్‌ లో బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో కనిపించడం అభిమానులకు షాక్ గురి చేసింది.

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మోదీ లాక్‌డౌన్ ప్రకటన చేయగానే ప్రభుదేవాతో చేస్తున్న 'రాధే' చిత్ర షూటింగ్‌ను వెంటనే నిలిపివేశాడు సల్మాన్ ఖాన్. తనకు ఇష్టమైన పాన్వెల్ ఫాంహౌస్‌లో తన ఫ్యామిలీతో కలిసి, దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలో ఉన్నారు. పాన్వెల్ ఫాంహౌస్‌ లో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ తో జాక్వలైన్ జత కలిసి అర్పిత పిల్లలతో ఎంజాయ్ చేస్తూ స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నది. మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాకు చేసిన వీడియో కాల్‌లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌ లో ఉన్న విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం పై బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.