Begin typing your search above and press return to search.

బెస్ట్ ఫ్రెండు చిరంజీవి కోసం స‌ల్మాన్ భాయ్ కాల్షీట్లు ఇచ్చారు!

By:  Tupaki Desk   |   14 Aug 2021 7:00 PM IST
బెస్ట్ ఫ్రెండు చిరంజీవి కోసం స‌ల్మాన్ భాయ్ కాల్షీట్లు ఇచ్చారు!
X
గ‌త కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స‌ల్మాన్ భాయ్ న‌టిస్తారు! అంటూ క‌థ‌నాలొస్తున్నా గాసిప్పులే అనుకున్నారు. భాయ్ ని ఓ సినిమా విష‌య‌మై మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా సంప్ర‌దించార‌ని అత‌డు అంగీక‌రించాలి క‌దా.. భాయ్ కి అంత టైముంటుందా? అంటూ లైట్ తీసుకుని మాట్లాడారు.

కానీ సల్మాన్ ఖాన్ చిరంజీవికి తేదీలను కేటాయిస్తాన‌ని హామీ ఇచ్చి షాకిచ్చారు. చిరుకి ఆ మేర‌కు స్నేహితుడు స‌ల్మాన్ ప్రామిస్ చేశార‌ని ఇప్పుడు మ‌రో స‌మాచారం అందింది. లూసీఫ‌ర్ రీమేక్ లో చిరంజీవితో క‌లిసి స‌ల్మాన్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిన‌దే. దీనికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో చిరు పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతుంది. భారీ యాక్ష‌న్ తో సినిమా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది.

సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్ర‌లో న‌టిస్తారా? అంటే అందుకు అవ‌కాశం లేదు. అత‌డు అతిధి పాత్రలో కనిపిస్తారు. నిడివి చాలా చిన్న‌దే అయినా చాలా స్టైలిష్ యాక్ష‌న్ సీక్వెన్స్ తో అద‌రిపోతుంది. మ‌ల‌యాళ వెర్ష‌న్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. నిడివి మ‌రీ చిన్న‌ది కాదు కొన్ని స‌న్నివేశాలు స‌ల్మాన్ పై ఉంటాయి. అతిథి పాత్ర అయినా ఫ్లాష్ లాగా వ‌చ్చి వెళ్ల‌డు. చిరుతో ఇంట‌రాక్ట్ అవుతూ ఆస‌క్తిని పెంచేదిగా ఉంటుంది. అత‌డు మంచి ఫైట‌ర్ గానూ క‌నిపిస్తాడు. స‌ల్మాన్ ఖాన్ ఇప్పటికే తన తేదీలను ఖరారు చేసాడు. ఈ విష‌యాన్ని అత్యంత ఘ‌నంగా ప్ర‌క‌టించేందుకు మెగా కాంపౌండ్ సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా.. నయనతార ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ తో క‌లిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తెలుగు-త‌మిళం-హిందీ లో ఈ సినిమా రిలీజ‌య్యేందుకు ఆస్కారం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ `సైరా-న‌ర‌సింహారెడ్డి` హిందీలో రిలీజై క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంది. చిరంజీవి న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిసాయి. 60 ప్ల‌స్ లో విరోచిత పోరాటాల్లో బాస్ చిరు న‌ట‌న చూసి ముంబై మీడియా హ్యాట్సాఫ్ చెప్పిందంటే అర్థం చేసుకోవాలి. సైరా మెగాస్టార్ కి మార్కెట్ పెంచిందే కానీ త‌గ్గించ‌లేద‌న్న‌ది నిజం. ఇప్పుడు చిరు న‌టించిన సినిమాల అనువాదాల‌కు డ‌బ్బింగుల‌కు గిరాకీ అమాంతం పెరిగింది. ఆ క్ర‌మంలోనే పాన్ ఇండియా మార్కెట్లో కీల‌క‌మైన హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు స‌ల్మాన్ ని బ‌రిలో దించ‌డంతో లూసీఫ‌ర్ రీమేక్ కి హైప్ పెర‌గ‌నుంది. హిందీ మార్కెట్ ప‌రంగానూ ఇది పెద్ద ప్ల‌స్ కానుంది.