Begin typing your search above and press return to search.

సింధూతో ఫోటో దిగానన్న సల్మాన్

By:  Tupaki Desk   |   20 Aug 2016 11:48 AM GMT
సింధూతో ఫోటో దిగానన్న సల్మాన్
X
సినిమా స్టార్లతో ఫోటో దిగేందుకు అందరూ తెగ ఉత్సాహం చూపుతారు. వారితో దిగిన ఓ ఫోటో గురించి అందరికీ చెప్పేసుకుని హ్యాపీ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలాగే సంతోషించేస్తున్నాడు. అయితే.. ఇక్కడ ఫోటో దిగిన అభిమాని సల్మాన్ కావడమే విశేషం.

ఒలింపిక్స్ లో రజత పతకంగా సాధించిన పివి సింధుకి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇమేజ్ వచ్చేసింది. ఈ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు కూడా పొందింది. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయినా.. అందరి హృదయాలను గెలుచుకుంది. 'నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ ను మా అమ్మతో కలిసి టీవీలో చూశాను. తనతో నేను ఫోటో దిగానని అమ్మతో చెప్పాను. చాలా గర్వంగా ఉంది' అన్నాడు సల్మాన్. అని చెబుతూ ఒక ఫోటోగ్రాఫ్‌ కూడా షేర్ చేశాడు.

తనే పెద్ద స్టార్ అయుండి కూడా.. ఈ స్పోర్ట్స్ స్టార్ తో ఫోటో దిగినందుకు సంతోషంగా ఉందని చెప్పడం సల్లూ భాయ్ మంచితనం గురించి చెబుతుంది. అయితే.. ఈ రియో ఒలింపిక్స్ కు సల్మాన్ కూడా ఓ బ్రాండ్ అంబాసిడర్ అని తెలుసుగా.. ఆ టైమ్ లోనే ఈ ఫోటో క్లిక్ మనించారు.