Begin typing your search above and press return to search.

రానా గురించి స‌ల్మాన్ ఏం చెప్పాడంటే..?!

By:  Tupaki Desk   |   12 July 2015 7:33 AM IST
రానా గురించి స‌ల్మాన్ ఏం చెప్పాడంటే..?!
X
భ‌ల్లాల‌దేవ‌గా అద‌ర‌గొడుతున్న మ‌న రానా గురించి బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పాడు. మొద‌ట్లో రానాకి సినిమాల్లో న‌టించే ఆస‌క్తి ఉండేది కాద‌ట‌. ఆయ‌నొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాల‌నుకొన్నాడ‌ట‌. కానీ నువ్వు సినిమాల్లోకి వ‌స్తేనే బావుంటుంద‌ని స‌ల్మాన్‌ఖాన్ చెప్పాడ‌ట‌. ఆ విష‌యాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు స‌ల్మాన్‌ఖాన్‌. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `బాహుబ‌లి` అన్ని చోట్లా అద‌రగొడుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లోనూ క్రేజీగా బిజినెస్ చేస్తోంది. ఫ‌స్ట్ డేలో ఏ డ‌బ్బింగ్ సినిమాకి రాన‌న్ని వ‌సూళ్లు బాహుబ‌లి సొంతం చేసుకొని భ‌ళా అనిపించింది. ఆ వ్యాపారం గురించి, సినిమా గురించి ప‌రిణీతి చోప్రా, విద్యాబాల‌న్‌ల‌తో పాటు స‌ల్మాన్‌ఖాన్ స్పందించాడు.

స‌ల్మాన్ అయితే బాహుబ‌లిని ఆకాశానికెత్తేశాడు. సినిమా ప్రోమోని చూశాన‌నీ, అదిరిపోయింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. రానా చాలా బాగా క‌నిపిస్తున్నాడ‌ని మెచ్చుకొన్నారు. ఇంకా ఆయ‌న సినిమా గురించి మాట్లాడుతూ ``రానా ఫాద‌ర్ సురేష్‌బాబు నాకు మంచి ఫ్రెండ్‌. దీంతో రానా ఎప్ప‌ట్నుంచో తెలుసు. త‌న‌ని సినిమాలు చేయ‌మ‌న్న‌ది ఇందుకే. కానీ త‌నేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాల‌నుకొన్నాడు`` అని న‌వ్వుతూ చెప్పుకొచ్చాడు. ప‌క్క‌నే ఉన్న అనుప‌మ్ ఖేర్ `అవునా... `అని ఆశ్చ‌ర్య‌పోతూ స‌ల్మాన్‌ని అడిగాడు. నిజం... అని స్పందిస్తూ బాహుబ‌లి బిజినెస్ చాలా బాగుంద‌ని స‌ల్మాన్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సినిమా ప్ర‌తీ శుక్ర‌వారం ఒక‌టొస్తే బిజినెస్ అదిరిపోతుంద‌ని ప‌రిణీతి చోప్రా చెప్పుకొచ్చింది. విద్యాబాల‌న్ కూడా బాహుబ‌లి బిజినెస్‌పై స్పందించింది. ఆ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ `థ్యాంక్యూ భాయ్‌` అని కృత‌జ్జ‌త‌లు చెప్పాడు రానా.