Begin typing your search above and press return to search.

నా బయోపిక్ సో బోరింగ్ అంటున్న స్టార్

By:  Tupaki Desk   |   16 July 2016 7:38 AM GMT
నా బయోపిక్ సో బోరింగ్ అంటున్న స్టార్
X
ప్రస్తుతం బాలీవుడ్ లో రియల్ లైఫ్ స్టోరీల సీజన్ తెగ నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్లతో పాటు పలు చరిత్ర ఆధారిత సినిమాలు తెరకెక్కుతున్నాయి. సచిన్ - అజార్ - ధోనీ లాంటి సినిమాలన్నీ క్యూ కట్టేశాయి. అలాగే కొందరు సినీ స్టార్లపై కూడా బయోపిక్స్ కు రంగం సిద్ధమవుతోంది. స్టార్ హీరో సంజయ్ దత్ పై సినిమా తీస్తున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది.

మరి బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ పై బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న సల్లూ భాయ్ కి ఎదురయింది. 'నా జీవితం చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకే నా జీవితంపై ఎవరూ సినిమా తీయలేరు. నా బయోపిక్ లో చాలా మంది చనిపోతూ ఉంటారు' అంటున్నాడు సల్మాన్. ఒకవేళ ఎవరైనా నిర్మాత మీ బయోపిక్ తీస్తానని వస్తే అనుమతిస్తారా అనే ప్రశ్నకు కూడా కండల వీరుడి నుంచి ఆన్సర్ వచ్చింది.

'లేదు.. ఎవరూ నా జీవితంపై పూర్తిగా రాయలేరు. అలా రాయాలంటే నేను కానీ.. నా బ్రదర్స్ లేదా సిస్టర్ కానీ రాయాలి. వారికి కూడా నా జీవితంలో కొన్ని భాగాలు తెలియవు.' అని చెప్పిన సల్మాన్.. ఆన్ స్క్రీన్ పై తన పాత్రను చేయగలిగేవారు ఎవరూ లేరని తేల్చేశాడు. ప్రస్తుతం సుల్తాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నానని.. ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశంసలతో సంతోషంగా ఉందని చెప్పాడు సల్మాన్ ఖాన్.