Begin typing your search above and press return to search.

ఆర్యన్ అరెస్ట్: షారుఖ్ ఖాన్ ను కలిసిన సల్మాన్ ఖాన్

By:  Tupaki Desk   |   4 Oct 2021 9:31 AM GMT
ఆర్యన్ అరెస్ట్: షారుఖ్ ఖాన్ ను కలిసిన సల్మాన్ ఖాన్
X
ముంబై నుంచి గోవా వెళుతున్న షిప్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ కిడ్ ఇప్పటికీ ఎన్‌సిబి అధికారుల అదుపులో ఉన్నారు. అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడితోపాటు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ ను కోర్టులో హాజరు పరచగా.. కోర్టు అతడికి ఒకరోజు ఎన్.సీబీ కస్టడీకి పంపారు.

ఆర్యన్ అరెస్ట్ తర్వాత సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నిన్న రాత్రి షారూఖ్‌ని కలవడానికి అతడి ఇంటికెళ్లాడు. బాండ్‌స్టాండ్ ప్రాంతంలో ఉన్న మన్నాట్ వద్ద కలిశారు. ఆదివారం రాత్రి మన్నత్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు సల్మాన్ కెమెరా కంటికి చిక్కాడు.

షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంటపాటు గడిపారు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి నటుడు తన స్నేహితుడితో మాట్లాడటానికి వెళ్లాడని తెలిసింది. సల్మాన్ ఖాన్ తన రేంజ్ రోవర్ కారు ముందు సీటులో కూర్చొని కనిపించాడు.

సల్మాన్ -షారూఖ్ ఖాన్ లు టాలీవుడ్ లో సన్నిహితులు. అనేక సినిమాలలో కలిసి నటించారు. సల్మాన్ త్వరలో షారుఖ్ రాబోయే చిత్రం పఠాన్‌లో అతిధి పాత్రలో కనిపించనున్నారు.

షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ ను పోలీసులు అరెస్ట్ చేయగా సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. అందరూ షారుఖ్ ను పరామర్శించేందుకు క్యూ కట్టారు. స్టార్ కిడ్‌ను ఆదివారం మధ్యాహ్నం మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ సేథ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాలతో కలిసి అరెస్టు చేశారు. వారికి నేటికి రిమాండ్ విధించారు. వారు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (c), 20 (b), 27 మరియు 35 కింద బుక్ చేయబడ్డారు.

ఆర్యన్ ఖాన్ తరఫున న్యాయవాది సతీష్ మనేషిండే ఈ రోజు బెయిల్ దాఖలు చేశారు.