Begin typing your search above and press return to search.

సల్మాన్ మామూలోడు కాదండోయ్

By:  Tupaki Desk   |   15 May 2016 9:30 AM GMT
సల్మాన్ మామూలోడు కాదండోయ్
X
బాలీవుడ్లో కండల వీరులు చాలామంది ఉన్నారు. ఐతే ఈ కండల క్రేజుకి ఆద్యుడు ఎవరు అంటే సల్మాన్ ఖాన్ పేరే చెప్పాలి. తొంభైల్లో సినీ రంగ ప్రవేశం చేసినప్పట్నుంచే అతడికి బాడీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్.. లాంటి వాళ్లు బాడీ గురించి పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ సల్మాన్ తన కండలతో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాక వాళ్లు కూడా అతడి బాటలోనే నడవాల్సి వచ్చింది. బాలీవుడ్లో తర్వాత వచ్చిన ప్రతి హీరో కూడా సల్మాన్ ను అనుసరించాల్సి వచ్చింది. ప్రస్తుతం కండలు.. సిక్స్ ప్యాకులు లేకుండా ఏ హీరో కూడా బాలీవుడ్లోకి అడుగుపెట్టట్లేదు.

50 ఏళ్ల వయసులోనూ సల్మాన్ మెయింటైన్ చేస్తున్న ఫిజిక్.. అతడి ఫిట్ నెస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అందులోనూ తన కొత్త సినిమా ‘సుల్తాన్’లో రెజ్లర్ పాత్ర పోషిస్తుండటంతో బాడీ మీద మరింతగా శ్రద్ధ పెట్టాడు సల్మాన్. ఈ సినిమా కోసం సల్మాన్ ఎంత ఫిట్ గా తయారయ్యాడంటే ఈ సినిమా షూటింగ్ ముగిసన సందర్భంగా తనతో కలిసి నటించిన ఇద్దరు భారీకాయులైన రెజ్లర్లను భుజాల మీదికి ఎత్తుకుని ఫొటోలకు పోజులివ్వడం విశేషం. అది చూసి ‘సుల్తాన్’ యూనిట్ సభ్యులందరూ షాకయ్యారు. సోషల్ మీడియాలో సైతం ఈ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇవి చూసి సల్మాన్ మామూలోడు కాదని చర్చించుకుంటున్నారు జనాలు.