Begin typing your search above and press return to search.

గాడ్ ఫాదర్ కు బై బై చెప్పిన సల్లూ భాయ్..!

By:  Tupaki Desk   |   25 March 2022 11:30 PM GMT
గాడ్ ఫాదర్ కు బై బై చెప్పిన సల్లూ భాయ్..!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల ముంబైలో జరిగిన షెడ్యూల్ లో చిరంజీవి తోపాటుగా సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఇద్దరు అగ్ర కథానాయికులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సల్మాన్ కు సంబంధించిన సీన్స్ ను కంప్లీట్ చేసిన మేకర్స్.. గురువారంతో ముంబై షెడ్యూల్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.

సల్మాన్ ఖాన్ షూటింగ్ పూర్తైన నేపథ్యంలో దర్శకుడు మోహన్ రాజా ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌ లో ఎమోషనల్ పోస్ట్ రాశారు. సల్లూ భాయ్ ని మైటీ మ్యాన్ అని.. స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొన్నారు.

సల్మాన్ ఖాన్ తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. షూటింగ్ ఎంతో కంఫర్టబుల్ గా, మెమొరబుల్ గా సాగిందని దర్శకుడు తెలిపారు. చిరంజీవి సహకారం, ప్రోత్సాహంతో ఇది సాధ్యపడిందని మోహన్ రాజా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్స్‌ లోని ఫుటేజీని అభిమానులతో పంచుకున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ‘గాడ్ ఫాదర్’ మూవీ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇప్పుడే కొన్ని సీన్స్ కు సంబంధించిన రషెస్ చూశానని.. అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా కోసం కొత్త కీ-బోర్డులు తెప్పించుకోవాలని.. వర్క్ చేస్తున్నప్పుడు అవి స్మాష్ కావడం, పగిలిపోవడం ఖాయమని తమన్ పేర్కొన్నారు.

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా 'గాడ్ ఫాదర్' తెరకెక్కుతోంది. ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన షార్ప్ షూటర్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని మలయాళం తప్ప మిగిలిన అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.