Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్ట్ చేయడం లేదట...!

By:  Tupaki Desk   |   5 May 2020 9:10 AM GMT
మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్ట్ చేయడం లేదట...!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. 'లూసిఫర్' అనే మలయాళ మూవీని చిరు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్ - పృథ్వీరాజ్ హీరోలుగా రూపొందిన 'లూసిఫర్' మూవీ మలయాళీ భాషలో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుంచాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆయన నిర్మాణంలోనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మూవీ రూపొందనుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను 'సాహో' ఫేమ్ సుజీత్‌ కి అప్పగించినట్లు క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా భారీ రేంజ్ లో ఉండేలా స్క్రిప్ట్ రూపొందించామని కోరారట చిరంజీవి. ఇప్పటికే సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడట.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘లూసీఫర్’ చిత్రంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ తో చేయించాలనుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడనేది పుకారే అని తెలుస్తోంది. అసలు మలయాళం రీమేక్ లో నటించే ఆలోచనే లేదని సమాచారం. సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే రాబోయే కొన్నేళ్ల పాటు బిజీగా ఉండనున్నాడు.. ఇక వేరే భాషల్లో నటించే తీరికే లేదని తెలుస్తోంది. కాగా ఈ పాత్రని ఇంతక ముందు అల్లు అర్జున్ చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారే అని తెలుస్తోంది. మలయాళ 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్ కి నమ్మకమైన వ్యక్తిగా ఉండే ఒక పాత్రలో హీరో పృథ్వీరాజ్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అందుకే ఆ పాత్రని ఎవరు పోషిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.