Begin typing your search above and press return to search.

#BB : ప్యాంట్‌ లో పెట్టుకుంటారా అంటూ లేడీ కంటెస్టెంట్‌ పై సల్మాన్‌ సీరియస్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 2:30 AM GMT
#BB : ప్యాంట్‌ లో పెట్టుకుంటారా అంటూ లేడీ కంటెస్టెంట్‌ పై సల్మాన్‌ సీరియస్‌
X
ఎప్పటిలాగే హిందీ బిగ్‌ బాస్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి వీకెండ్‌ లో కూడా కంటెస్టెంట్స్‌ కు సల్మాన్‌ ఖాన్‌ ఇచ్చే వార్నింగ్‌ లు వారికి ఇచ్చే పనిష్మెంట్స్‌ లు ఈసారి కూడా రొటీన్‌ గా జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్‌ మద్య గొడవలను పరిష్కరించడంలో సల్మాన్‌ ఖాన్‌ తనదైన శైలిలో స్టాండ్‌ తీసుకుంటూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక గత వారం మండే ఎపిసోడ్‌ లో ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ జరుగుతున్న సమయంలో మాస్క్‌ ఉన్న వారు సేవ్‌ అవుతారు.. మాస్క్‌ దక్కించుకోలేక పోయిన వారు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అవుతారు అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించగా సౌత్‌ హీరోయిన్‌ అయిన నిక్కీ తంబోలి తన ప్రత్యర్థి అయిన రాహుల్‌ కు మాస్క్‌ దక్కకుండా తన పాయింట్‌ లో పెట్టేసుకుంది.

ఆ పరిణామంతో రాహుల్‌ టాస్క్‌ ను వదిలేసి తాను ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యేందుకు సిద్దం అన్నాడు. ఆ సమయంలో అతడు వ్యవహరించిన తీరు ను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఆవేశంతో మరెవ్వరైనా కూడా బలవంతంగా ఆమె నుండి మాస్క్‌ దక్కించుకునేందుకు అక్కడ చెయ్యి పెట్టి తీసే అవకాశం ఉంది. కాని రాహుల్‌ మాత్రం అలా చేయలేదు. అదే విషయాన్ని వీకెండ్‌ ఎపిసోడ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ ప్రస్థావించి కాస్త సీరియస్‌ గానే నిక్కీకి వార్నింగ్‌ ఇచ్చాడు.

నువ్వు మాస్క్‌ ఎక్కడ పెట్టుకున్నావ్‌.. అలా ఎవరైనా చేస్తారా. అక్కడ చెయ్యి పెట్టి మాస్క్‌ తీస్తే నీ పరువు ఏమవుతుంది నీ పరిస్థితి ఏంటీ అనేది నీవ్వు ఆలోచించావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో తనకు ఏం చేయాలో తోచక అలా చేశాను అని ఆ తర్వాత వెళ్లి రాహుల్‌ కు సారీ చెప్పాను అంటూ నిక్కీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. వీకెండ్‌ ఎపిసోడ్‌ లో మరోసారి రాహుల్‌ కు నిక్కీ సారీ చెప్పింది. తెలుగులో రూపొందిన బూతు సినిమా చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో హీరోయిన్‌ గా నటించిన నిక్కీ బిగ్‌ బాస్‌ హౌస్‌ లో కూడా అలాగే వ్యవహరిస్తుంది అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.