Begin typing your search above and press return to search.

14 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యా..షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన భాయ్ మాజీ ప్రేయసి

By:  Tupaki Desk   |   13 March 2021 12:00 PM IST
14  ఏళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యా..షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన భాయ్ మాజీ ప్రేయసి
X
షాకింగ్ నిజాన్ని బయపెట్టింది. 1990లలో తన నటనతో ఆకట్టుకొని.. గడిచిన కొన్నేళ్లుగా ఎన్జీవోను నడుపుతోంది నటి సోమీ అలీ. భాయ్ సల్మాన్ మాజీ ప్రేయసిగా చెప్పే ఆమె.. తన జీవితంలో తనకు ఎదురైన దారుణాల గురించి వెల్లడించి షాక్ కు గురి చేసింది. లైంగిక వేధింపులకు గురయ్యే చిన్నారుల్ని సేవ్ చేసే ఆమె.. తన జీవితంలో జరిగిన దారుణాల గురించి చెప్పి నోట మాట రాకుండా చేసింది.

దాయాది పాకిస్తాన్ కు చెందిన ఆమె భారత్ కు వచ్చేసి.. ఉండిపోవటం తెలిసిందే. పాక్ లో ఉన్నప్పుడు తన చిన్నతనంలో రెండుసార్లు లైంగిక వేధింపులకు గురైతే.. టీనేజ్ లో ఒకసారి మాత్రం ఏకంగా అత్యాచారానికి గురైన నిజాన్ని బయటకు చెప్పేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన నిజాల్ని వెల్లడించింది. ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న తాను.. ఇప్పటికి నిజాల్ని వెల్లడించకపోతే మోసం చేసినట్లు అవుతుందని చెప్పి.. పెదవి విప్పింది.

పాకిస్తాన్ లో ఉన్నప్పుడు తొలిసారి లైంగిక వేధింపులకు గురయ్యానని.. అప్పుడు తన వయసు ఐదేళ్లు అని చెప్పింది. ‘‘పనివాళ్ల క్వార్టర్స్ లో ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయి. మా అమ్మానాన్నలకు ఈ విషయాన్ని చెప్పా. వారు చర్యలు తీసుకున్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పొద్దని మందలించారు. అవే ఆలోచనలు నాలుగేళ్లు నా మెదడును పట్టి పీడించాయి. నేనేమైనా తప్పు చేశానా? నా పేరెంట్స్ ఎందుకలా చెప్పారు? అన్న ప్రశ్నలు వచ్చేవి. పాకిస్తాన్ లోనూ.. భారత్ లోనూ ఒకేలాంటి సంప్రదాయాలు ఉంటాయి. వారు నన్నురక్షిస్తున్నా.. నేను అర్థం చేసుకోలేకపోయాను’’ అని చెప్పారు.

తనకు మళ్లీ అలాంటి లైంగిక దాడి తొమ్మిదేళ్ల వయసులో మరోసారి ఎదురైనట్లు చెప్పారు. తర్వాత పద్నాలుగేళ్ల వయసులో తొలిసారి అత్యాచారానికి గురైనట్లు ఆమె చెప్పారు. మూడేళ్ల క్రితం వరకు ఈ విషయాల మీద మాట్లాడేదానిని కానని చెప్పారు. పద్నాలుగేళ్లుగా ఎన్జీవోను నిర్వహిస్తూ కూడా ఇప్పటికి దాని గురించి నిజం చెప్పకపోతే మోసం చేసినట్లు అవుతుందని చెప్పినట్లు చెప్పారు. ఆమె చెప్పిన నిజాలు ఇప్పుడు సంచలనాలుగా మారాయి.