Begin typing your search above and press return to search.

RRR హుక్ స్టెప్ అద‌రగొట్టిన స‌ల్మాన్ భాయ్

By:  Tupaki Desk   |   25 Dec 2021 8:30 AM GMT
RRR హుక్ స్టెప్ అద‌రగొట్టిన స‌ల్మాన్ భాయ్
X
RRRలోని నాటు నాటు పాట ఎంత‌టి సెన్సేష‌న్ సృష్టించిందో తెలిసిందే. యూట్యూబ్ లో కోట్లాది మంది ఈ పాట‌ను వీక్షించారు. ముఖ్యంగా హుక్ స్టెప్ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. తార‌క్ - రామ్ చ‌ర‌ణ్ త‌మ‌దైన స్టైల్ డ్యాన్సింగుల‌తో ది బెస్ట్ గా అల‌రించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసారు. పాట‌లో మ్యూజిక్ కంటే కొరియోగ్ర‌ఫీకి ఎక్కువ పేరొచ్చింది. ఆ పాట‌ను తెర‌కెక్కించేందుకు ఎంత‌గా డెడికేట్ అయ్యారో చూశాం. RRR పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మేకర్స్ కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. ఈ పాట హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ట్రైల‌ర్ ఇప్ప‌టికే రిలీజై అంత‌ర్జాలంలో రికార్డులు సృష్టించింది. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ టీమ్ ముంబైలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ అంటే ఇంకో 20 రోజులు మాత్ర‌మే ప్ర‌మోషన్స్ కి ఆస్కారం ఉంది. అందుకే టీమ్ హిందీ ప్ర‌మోష‌న్స్ ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోంది.

ఇంత‌కుముందు క‌పిల్ శ‌ర్మ షోలో ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజ‌మౌళి స‌హా చ‌ర‌ణ్ - తార‌క్ - ఆలియా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. షో టెలీకాస్ట్ కావాల్సి ఉండ‌గా ఫోటోలు ప్రోమో వైర‌ల్ అయ్యాయి. అలాగే సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 15లోనూ ఆర్.ఆర్.ఆర్ కి ప్ర‌మోష‌న్ చేస్తున్నారు టీమ్. ఈ షోలో తార‌క్ - చ‌ర‌ణ్ ల‌తో పాటు ఆలియా పాల్గొంది. అందుకు సంబంధించిన తాజా ప్ర‌మో వైర‌ల్ గా మారింది. నేటి సాయంత్రం 9.30 పీఎం ఇది క‌ల‌ర్స్ టీవీలో ప్ర‌సారం కానుంది.

ప్రోమోలో స‌ల్మాన్ భాయ్ నాటు నాటు (నాచు నాచు.. హిందీలో) పాట‌కు హుక్ స్టెప్ వేసి అద‌రగొట్టారు. ఇటు తార‌క్.. అటు ఆలియా - చ‌ర‌ణ్ ల‌తో అత‌డు హుక్ స్టెప్ వేస్తూ ఎంతో ఫ‌న్ క్రియేట్ చేశారు. ఆలియా ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల్లా నేను కూడా హుక్ స్టెప్ వేస్తాన‌ని ప్రామిస్ చేసాను నీకు! అంటూ భాయ్ ఎంతో జోష్ ని క‌న‌బ‌రిచారు. ఇక స‌ల్మాన్ ఖాన్ కి చ‌ర‌ణ్ ఎంతో క్లోజ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తార‌క్ కూడా మ‌రింత ద‌గ్గ‌రైపోయాడు భాయ్ తో. మ‌నోళ్ల ట్యాలెంట్ ఏ రేంజులో ఉందో బిగ్ బాస్ వేదికగా మ‌రోసారి హిందీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌నుంది. ఆర్.ఆర్.ఆర్ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఓపెనింగ్ రికార్డుల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని ఇప్ప‌టికే ప్రీబుకింగ్స్ చెబుతోంది.

అమెరికా స‌హా అన్నిచోట్లా ఒక రేంజులో బుకింగ్స్ సాగ‌నున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఉత్త‌రాది మార్కెట్లోనూ ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్ర‌చారంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. దీనిని బ‌ట్టి అక్క‌డ కూడా ఆర్.ఆర్.ఆర్ రికార్డులు బ్రేక్ చేస్తుంద‌ని భావిస్తున్నారు.