Begin typing your search above and press return to search.

నెక్స్ట్ ఈద్ కూడా నాదే అంటున్న సల్మాన్!

By:  Tupaki Desk   |   7 Jun 2019 12:23 PM IST
నెక్స్ట్ ఈద్ కూడా నాదే అంటున్న సల్మాన్!
X
బాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరే సూపర్ స్టార్లు. ఒకరు అమీర్ ఖాన్.. మరొకరు సల్మాన్ ఖాన్. షారూఖ్ ఖాన్ ఈ లిస్టులోని బైటకు వెళ్ళి రెండేళ్ళయింది. కాకపోతే ఆయన ఇంకా సూపర్ స్టార్ కాదు అనే వాస్తవం అభిమానులకు మింగుడుపడడం లేదు. సరే ఆయన సంగతి పక్కన పెడితే అమీర్ ఖాన్ తో ఉండే ఒకే ఇబ్బంది ఏంటంటే అయన వెంట వెంటనే సినిమాలు చేయడు.. గ్యాప్ తీసుకుని ఆచితూచి ఎంపిక చేసుకున్న సినిమాల్లో మాత్రమే నటిస్తాడు. కానీ సల్మాన్ మాత్రం వరసబెట్టి సినిమాలు చేస్తాడు. వరసబెట్టి వాటిని విడుదల చేస్తాడు.

మొన్నే ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా సల్మాన్ భాయిజాన్ కొత్త చిత్రం 'భారత్' విడుదలయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. హిట్ దిశగా దూసుకుపోవడం ఖాయమని తీర్పు వచ్చింది. అదేంటో కానీ సల్మాన్ కు ఈద్ కు అవినాభావ సంబంధం. ఈద్ అంటే చాలు సల్మాన్ సినిమా రిలీజ్ ఉండాల్సిందే. ఏదో ఒకటి ఆరా సందర్భాలు తప్ప దాదాపు గా ఈద్ కు రిలీజ్ ఐన సల్మాన్ సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సెంటిమెంట్ ను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు సల్మాన్. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఇన్షా అల్లా' అనే చిత్రాన్ని 2020 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామంటూ నిన్న అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భన్సాలి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంజయ్ లీలా భన్సాలి స్వయంగా నిర్మిస్తున్నారు. అలియా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఈ పోస్టర్ ను షేర్ చేసి "వచ్చే ఏడాది ఈద్ కు.. ఇన్షా అల్లా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలియా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉంది. 'ఇన్షా అల్లా' కాకుండా ఆమె లిస్టులో ఉన్న సినిమాలు.. 'బ్రహ్మాస్త్ర'.. 'సడక్ 2'.. 'RRR'. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3' అనే చిత్రంలో నటిస్తున్నాడు.