Begin typing your search above and press return to search.
ప్రేమలో ఉన్నారా ప్రశ్నకు సల్లూ భాయ్ సమాధానం
By: Tupaki Desk | 1 Feb 2022 10:00 AM ISTఆరు పదుల వయసుకు చేరు అయిన సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. పెళ్లి అయితే చేసుకోలేదు కాని పలువురితో ఈయన రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈయన రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిన హీరోయిన్స్ మరియు అమ్మాయిల జాబిత చాలా పెద్దదే అనడంలో సందేహం లేదు. ఐశ్వర్య రాయ్ నుండి మొదలుకుని ఎంతో మంది తో ఈయన అఫైర్ పెట్టుకున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. మొన్న విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ తో కూడా సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారం సాగించాడనే వార్తలు వచ్చాయి. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది సల్మాన్ ఖాన్ అని కూడా అంటూ ఉంటారు.
అలాంటి కత్రీనా పెళ్లి గురించి మొదటి సారి ఒక బిగ్ వేదికపై సల్మాన్ స్పందించడం చర్చనీయాంశం అయ్యింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 15 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ పలువురు స్టార్స్ సమక్షంలో జరిగింది. ఆ సమయంలో కత్రీనా పాటకు టీవీ నటి ఒకరు డాన్స్ చేశారు. అప్పుడే కత్రీనా మరియు విక్కీ కౌశల్ ల పెళ్లి గురించి సల్మాన్ ఖాన్ ప్రస్తావించాడు. కంగ్రాట్స్ కత్రీనా.. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. కత్రీనా విక్కీ కౌశల్ ల పెళ్లితో అందరు సంతోషంగా ఉన్నారు అన్నాడు. అప్పుడే నటి షెహనాజ్ స్పందిస్తూ మీరు కూడా సంతోషంగా ఉన్నారా అంటూ ప్రశ్నించింది. అయినా మీరు సింగిల్ గా ఉంటేనే బాగుంటుందని ఆమె అన్నది. అప్పుడు సల్మాన్ స్పందిస్తూ ఔను నేను సింగిల్ అయినప్పుడే మరింత మెరుగ్గా కనిపిస్తాను అన్నాడు. వెంటనే ఆమె స్పందిస్తూ అంటే ఇప్పుడు మీరు సింగిల్ కాదా అంటూ ప్రశ్నించింది. అందుకు సల్మాన్ నుండి సమాధానం రాలేదు... కాని నేను సింగిల్ కాదు అన్న అర్థంతో ఒక నవ్వు అయితే వచ్చింది.
సల్మాన్ ఖాన్ రిలేషన్ లో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరు ఎప్పటి నుండి అనే విషయంలో క్లారిటీ లేదు. కాని తాజాగా ఆయన నవ్వుతో ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఆరు పదుల వయసుకు చేరు అయిన సల్మాన్ ఖాన్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే లేవు.. కాని ఆయన ఈ రిలేషన్ ను అయినా కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి. ఇక ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేసుకుంటూ వెళ్తున్న సల్మాన్ ఖాన్ బుల్లి తెరపై కూడా తనదైన శైలిలో దూకుడుగా ఉన్నాడు. బిగ్ బాస్ సీజన్ 15 ను ముగించడంతో సల్మాన్ అప్పుడే కొత్త సీజన్ కు సంబంధించి సైన్ చేశాడనే వార్తలు కూడా వస్తున్నాయి.