Begin typing your search above and press return to search.

పొకెట్ లోకి ఆ గ్లాస్ తోసుడేంది భాయ్?

By:  Tupaki Desk   |   5 Sep 2022 11:32 AM GMT
పొకెట్  లోకి ఆ గ్లాస్ తోసుడేంది భాయ్?
X
కొన్ని చేష్ట‌లు చాలా వింత‌గా అనిపిస్తాయి. సంద‌ర్భాన్ని...స‌న్నివేశాన్ని మిస్ చేసి చేస్తే వాటిని వింత ప‌నులుగానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. స‌రిగ్గా అలాగే అనిపిస్తుంది. ఇక్క‌డ స‌ల్మాన్ ఖాన్ చేస్తోన్న ఓ ప‌ని చూస్తుంటే? అలాగే అనిపిస్తుంది. ఇంత‌కీ భాయ్ ఏం చేసాడు? అంటారా అయితే మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సిందే.

అప్పుడే బ్లాక్ క‌ల‌ర్ కారులో నుంచి కింద‌కి దిగాడు భాయ్. దిగుతు దిగుతూ..జీన్స్ ప్యాంట్ స‌ర్దుకుంటూ.. జేబులోప‌లికి తొసేస్తున్న ఓ గాజు గ్లాస్ క‌నిపిస్తుంది. అందులో లిక్విడ్ రూపంలో వాట‌ర్ లా కనిపిస్తుంది. దీంతో నెటి జ‌నులు ఒక్కసారిగా అవాక్క‌య్యారు. తొస్తే జేబులోప‌లికి వాలెట్ తోయాలి. లేదా ఫోన్ తోయాలి ఆ రెంకాక‌పోతే ఇంకేదో చిన్న‌దైన‌ ఐట‌మ్ అయినా తోయాలి కానీ భాయ్ ఇక్క‌డ ఏకంగా గాజు గ్లాస్ ని తోయ‌డ‌మే విచిత్రంగా అనిపిచింది. దీంతో నెటి జ‌నులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఆ గ్లాసులో ఏముంది అని ఒక‌రు అడ‌గ‌గా..మ‌రొక‌రు వోడ్కానా.. టానికా అంటూ సందేహం వ్య‌క్తం చేసారు. మ‌రికొంత మంది ఆ ద్రవం కేవ‌లం వాట‌ర్ మాత్ర‌మే...వోడ్కానా...ఆల్కాహాల్ నో కాదు. హీ ఈజ్ జెంటిల్ మెన్. అత‌ను బ‌య‌ట ఎందుకు అలా ప్ర‌వ‌ర్తిస్తాడు. అంత‌ అవ‌స‌రం స‌ల్మాన్ కి ఏముందుంటున్నారు.

వాట‌ర్ అయితే మ‌రీ అంత‌గా దాచేయాల్సినంత అవ‌స‌రం ఏముంది? ఒక‌వేళ వాట‌ర్ అయితే గ్లాస్ లో వేసుకుని తెచ్చుకోవ‌డం దేనికి? వాట‌ర్ బాటిల్స్ ఉంటాయి క‌దా? లేక ఆరోగ్యం కోసం గ్లాస్ లో వాట‌ర్ వేసుకున్నారా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

కార‌ణాలు ఏవైనా మెజార్టీ వ‌ర్గం మాత్రం భాయ్ ఏదో సీక్రెట్ దాచేస్తున్నాడ‌నే అంటున్నారు. మ‌రి దీని గురించి స‌ల్మాన్ ఏమంటారో చూద్దాం.

ప్ర‌స్తుతం సల్మాన్ ఖాన్ టైగర్-3..క‌బీ ఈద్ క‌బీ దివాలీలో నూ న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. త్వ‌రలో 'కీసీ కా బాయ్ కీసీ కీ జాన్' చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇందులో వెంకటేష్.. పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.