Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్.. జీన్స్ తినేస్తున్నాడు

By:  Tupaki Desk   |   1 Jun 2017 2:23 PM IST
సల్మాన్ ఖాన్.. జీన్స్ తినేస్తున్నాడు
X
సల్మాన్ ఖాన్ కొత్త సినిమా వచ్చేస్తోంది. రంజాన్ సందర్భంగా ట్యూబ్ లైట్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు సల్లూ భాయ్. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈద్ కు వచ్చి ఇరగదీసే కలెక్షన్స్ సాధించేందుకు స్కెచ్ రెడీ చేసేసుకున్నాడు. రంజాన్ కి వచ్చిన సల్మాన్ సినిమాలపై బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. జూన్ 23న రిలీజ్ కానున్న ట్యూబ్ లైట్ మూవీకోసం తెగ ప్రచారం చేసేస్తున్నాడు బాలీవుడ్ కండలవీరుడు.

ఒకవైపు టీవీలు.. సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు.. మరోవైపు లైవ్ ఇంటరాక్షన్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి ఒక ఈవెంట్ హాజరైన సల్మాన్ ఖాన్.. తన చేష్టలతో వార్తలతో నిలిచాడు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో.. దారపు పోగులను తింటూ కెమేరాలకు చిక్కాడు సల్మాన్. ఒకసారి ప్యాంట్ ఎడమకాలికి ఉన్న పోగును బలవంతంగా తెంచి నోట్లో వేసుకున్న సల్లూభాయ్.. మరోసారి కుడికాలికి ఉన్న ప్యాంట్ పోగులను పీకి నోట్లో వేసుకున్నాడు.

రంజాన్ ఉపవాసాల కారణంగా సల్మాన్ ఖాన్ కు బాగా ఆకలిగా ఉండడంతోనే ఇలా దారం పోగులు తింటున్నాడని నెటిజన్లు కామెడీ చేసిపారేశారు. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి.. బీయింగ్ హ్యూమన్ అంటూ సల్మాన్ లాంఛ్ చేసిన క్లోతింగ్ బ్రాండ్ కోసం.. తినడానికి వీలైన జీన్స్ ప్యాంట్స్ ను లాంఛ్ చేశాడని.. వాటి ప్రచారం కోసమే ఇలా దారం పోగులను తింటున్నాడని జోకులు వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/