Begin typing your search above and press return to search.
అచ్చం సల్మాన్ భాయ్ లాగా ఉన్న అతడెవరు?
By: Tupaki Desk | 20 May 2021 11:00 AM ISTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కి ఇద్దరు సోదరులు ఉన్న సంగతి తెలిసిందే. సోహైల్ ఖాన్.. ఆర్భాజ్ ఖాన్ .. ఆ ఇద్దరూ నిర్మాతలుగా నటులుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు అతడికి మరో సోదరుడి లాంటి బాడీ డబుల్ ఆర్టిస్టును చూస్తే షాక్ తినకుండా ఉండలేం. అసలు సల్మాన్ భాయ్ సొంత అన్నదమ్ములే అలా లేరు! అని అంగీకరిస్తారు. అంతగా అతడి లుక్ డిట్టోగా దిగిపోయింది.
ఈద్ సందర్భంగా భాయ్ తాజా చిత్రం `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` రిలీజైన సంగతి తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 5 న జీ 5 న విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంటోంది. ఈ చిత్రంలో పర్వేజ్ కాజీ సల్మాన్ బాడీ డబుల్ గా నటించిన విషయం చాలామందికి తెలియదు. పర్వేజ్ తన ట్విట్టర్లో రాధే సెట్స్ నుండి కొన్ని చిత్రాలను పంచుకోగా అసలు విషయం రివీలైంది. అతను అచ్చం సల్మాన్ భాయ్ లాగా ఉండటాన్ని చూసి నెటిజనులు షాక్ తింటున్నారు.
బాడీ డబుల్ లేదా స్టంట్ మెన్ హీరోలకు డూప్ లుగా పని చేస్తుంటారు. తెరవెనుక అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. వీరు ఎంత ట్యాలెంట్ చూపించినా ఆ క్రెడిట్ కూడా హీరో ఖాతాలోకే పడిపోతుంది. సల్మాన్ తో కలిసి రాధే- దబాంగ్ 3- భారత్- రేస్ 3- టైగర్ జిందా హై- ప్రేమ్ రతన్ ధన్ పయో వంటి అనేక చిత్రాలకు ఫర్వేజ్ పనిచేశారు. పర్వేజ్ కాజీ - సల్మాన్ ఖాన్ తో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. భైజాన్ తో సెట్స్ నుంచి .. అంటూ ఈ ఫోటోలను పర్వేజ్ విడుదల చేశారు.
బాడీడబుల్స్ స్టంట్స్ అన్నివేళలా రిస్కీనే. మార్షల్ ఆర్ట్స్- హై క్లైంబింగ్- ఫ్రీ-ఫాలింగ్- ట్రిక్ డ్రైవింగ్- హార్స్‌బ్యాక్ రైడింగ్ ఇంకా చాలా రిస్కీ షాట్లలో సినీ తారలు చేయలేనివి చేయకూడనివి ఈ బాడీ డబుల్స్ చేస్తారు. అందుకోసం వారి ప్రాణాలను పణంగా పెడతారు. యాక్షన్ ని పీక్స్ కి తీసుకెళ్లడానికి బాడీ డబుల్స్ ఫీట్స్ ముఖ్య కారణం. టామ్ క్రూజ్- అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్- విద్యుత్ జామ్వాల్- అజయ్ దేవగన్ లాంటి స్టార్లు బాడీ డబుల్ తో పని లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేయడం తెలిసిందే.