Begin typing your search above and press return to search.

వదలనంటున్న ఆ పాపం..కోర్టుల చుట్టూ బాలీవుడ్ బడా స్టార్!

By:  Tupaki Desk   |   16 Sept 2020 11:15 AM IST
వదలనంటున్న ఆ  పాపం..కోర్టుల చుట్టూ  బాలీవుడ్ బడా స్టార్!
X
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కృష్ణజింకలను వేటాడిన కేసు వదలడం లేదు. 22 ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. ఈ కేసు విషయమై పలుసార్లు సల్మాన్ కోర్టు విచారణకు హాజరయ్యాడు. కొద్ది రోజు లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ కేసులో తన సహ నటులు అందరూ బయటపడ్డ సల్మాన్ మాత్రం ఇప్పటికీ కోర్టుల వెంట తిరగాల్సి వస్తోంది. ఈనెల 28వ తేదీన సల్మాన్ ఖాన్ మరోసారి రాజస్థాన్లోని జోధ్పూర్ కోర్టుకు కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది.. సల్మాన్ భవితవ్యం ఏంటి.. అతడికి అనుకూలం గా తీర్పు వస్తుందా..లేదా లేక పోతే జైలు శిక్ష కన్ఫర్మ్ చేస్తుందా..అని అందరూ ఎదురుచూస్తున్నారు.

1998లో ' హం సాత్ సాత్ హై ' సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సల్మాన్ ఖాన్ ఇతర నటీనటులు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సోనాలి బింద్రే అడవుల్లో కృష్ణ జింకలను, చింకారాలను వేటాడారు. ఈ విషయం బయటికి రావడంతో అప్పట్లోనే కేసు నమోదయింది. అప్పటినుండి ఈ కేసు విచారణ రాజస్థాన్లోని జోధ్పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు నుంచి సైఫ్ అలీ ఖాన్ సహా మిగతా నటీనటులంతా బయట పడగా సల్మాన్ మాత్రం కోర్టు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు 2018 ఏప్రిల్ 5న ఐదేళ్ల జైలు శిక్ష పడింది. రెండు రోజులు జైల్లో ఉన్న తర్వాత 2018 ఏప్రిల్ 17న ఆయన కు బెయిల్ వచ్చింది.

ఈ కేసు విచారణ ఇప్పటికీ ముగియక పోవడం తో ఆయన బెయిల్ పైనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జోధ్ పూర్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగనుంది. ఈ కేసు నుంచి ఇప్పటికైనా సల్మాన్ బయట పడతాడా లేదా..లేకపోతే జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇస్తుందా..ఏం జరుగుతుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు.