Begin typing your search above and press return to search.

భాయ్ మిడ్ నైట్ పార్టీలో కింగ్ ఖాన్ వీరంగం

By:  Tupaki Desk   |   27 Dec 2022 11:30 PM GMT
భాయ్ మిడ్ నైట్ పార్టీలో కింగ్ ఖాన్ వీరంగం
X
బాలీవుడ్ `భాయ్` స‌ల్మాన్ ఖాన్ ఈరోజు (డిసెంబర్ 27- మంగళవారం) తన 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. సూపర్ స్టార్ తన చిన్న మేనకోడలు అయత్ శర్మ (సల్మాన్ చిన్న చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ -నటుడు ఆయుష్ శర్మ కుమార్తె)తో కలిసి తన పుట్టినరోజును సంబ‌రంగా జరుపుకున్నారు. మేనమామ-మేనకోడలు ద్వయం కలిసి ఒక వేదిక‌గా సంద‌డి చేయ‌డం క‌న్నుల‌ పండుగ‌ను త‌ల‌పించింది. ఖాన్ కుటుంబం ఈ వేడుక‌ను చాలా ప్ర‌త్యేకంగా నిర్వ‌హించింది.

దీనికి సినీ పరిశ్రమలోని అత్యంత ప్రజాదరణ పొందిన కొందరు సెల‌బ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక‌లో సల్మాన్ ఖాన్ ని విష్ చేసేందుకు విచ్చేసిన కింగ్ ఖాన్ షారూక్ ఎంతో జోష్ తో క‌నిపించాడు. భాయ్ తో కింగ్ ఖాన్ చాలా ఎక్కువ సేపు త‌న విలువైన స‌మ‌యాన్ని గ‌డ‌ప‌డంతో ఆ ప్రాంగ‌ణం ఒక ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకుంది. ప‌రిశ్ర‌మ ఇద్ద‌రు దిగ్గ‌జ హీరోల క‌ల‌యిక అభిమానుల‌కు క‌న్నుల‌పండుగ‌గా మారింది. కింగ్ ఖాన్ స‌హా ఇత‌రుల స‌మ‌క్షంలో భాయ్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

బర్త్ డే బాయ్ సల్మాన్ ఖాన్ తన పుట్టిన‌రోజు వేడుక‌లో ఎప్పటిలాగే పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో స్టైలిష్ గా కనిపించాడు. బ్లాక్ పుల్ ఓవర్ లుక్ లో అత‌డి షైనీ లెద‌ర్ ఫ్యాంట్ స్పెష‌ల్ ఎలివేషన్ ని తెచ్చింది. దీనికి కాంబినేష‌న్ గా బ్లాక్ బూట్లు త‌న‌దైన శైలి సిల్వర్ బ్రాస్ లెట్ తో ప్ర‌త్యేకంగా క‌నిపించాడు. తన బర్త్ డే వేడుక‌లో ఉత్సాహంగా క‌నిపించిన స‌ల్మాన్ బయటకు వచ్చి ఫోటోగ్రాఫర్ లను అభినందించి వారితో చాలాసేపు ముచ్చ‌టించారు. అనంతరం ఆహ్వానితులతో కలిసి తన ప్రత్యేక బ‌ర్త్ డే వేడుక‌ను జరుపుకునే ముందు మీడియా మిత్రులతో ప్రత్యేకంగా కేక్‌ కట్‌ చేశారు.

మిడ్ నైట్ లో స‌డెన్ ట్విస్ట్...

సల్మాన్ ఖాన్ 56వ బర్త్ డే పార్టీలో షారూఖ్ ఖాన్ అనూహ్యంగా ప్రవేశించడం తో అది బిగ్ స‌ర్ ప్రైజ్ గా మారింది. టైగర్ 3 స్టార్ స‌ల్మాన్ తో బలమైన స్నేహానుబంధాన్ని కొన‌సాగిస్తున్న `పఠాన్` స్టార్ షారూక్ అర్థరాత్రి వేదిక వద్దకు రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. షారుఖ్ ఖాన్ కూడా స‌ల్మాన్ త‌ర‌హాలోనే బ్లాక్ అండ్ బ్లాక్ లో క‌నిపించారు. బ్లాక్ లుక్ లో హుడ్ జాకెట్ లో సూపర్ హ్యాండ్ సమ్ గా కనిపించాడు. కరణ్ అర్జున్ ద్వయం పార్టీలో బిగ్ బ్లాస్ట్ కి తెర తీసారు. అంతేకాదు.. తెల్లవారుజాము వరకు కలిసి డ్యాన్స్ లు చేస్తూ పార్టీని ఎంజాయ్ చేశారు. ఇది బాలీవుడ్ వేడుక‌ల్లోనే అత్యంత ప్ర‌త్యేక వేడుక‌గా నిలిచింద‌ని మీడియా చెబుతోంది.

షారుఖ్ ఖాన్ పార్టీ నుంచి వేకువ‌ఝామున‌ వెళ్లే స‌మయంలో అతనితో పాటు స‌ల్మాన్ కనిపించారు. ఆ ఇద్దరూ ఒక‌రినొక‌రు హ‌గ్ చేసుకుని సోద‌ర బంధాన్ని పంచుకున్నారు. షారూఖ్‌ నిష్క్రమణకు ముందు ఆ ఇద్దరూ కలిసి కెమెరాలకు పోజులిచ్చారు.

ఒక‌రికోసం ఒక‌రుగా..

స‌ల్మాన్ ఖాన్- షారూక్ ఖాన్ జోడీ ఇక‌పై క‌లిసి వ‌రుస చిత్రాల్లో క‌నిపించ‌నుండ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది. స‌ల్మాన్ మోస్ట్ అవైటెడ్ టైగర్ ఫ్రాంచైజీ నుండి అతని పాపులర్ క్యారెక్టర్ టైగర్ ను కింగ్ ఖాన్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `పఠాన్‌`లో పునరావృతం చేయడం థియేట‌ర్ల‌లో బిగ్ స‌ర్ ప్రైజ్ గా మార‌నుంది. సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జనవరి 2023లో ఈ భారీ చిత్రం థియేటర్లలోకి రానుంది.

అలాగే సల్మాన్ ఖాన్ టైగర్ ఫ్రాంచైజీ నుంచి క్రేజీగా మూడవ భాగం విడుద‌ల‌వుతుంది. టైగర్ అకా అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో స‌ల్మాన్ మ‌రోసారి యాక్ష‌న్ స్టార్ గా తిరిగి వ‌స్తున్నాడు. టైగర్ 3 అని టైటిల్ ని ఖరారు చేయ‌గా.. ఈ చిత్రం నవంబర్ 2023లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కి రానుంది. లేడీ సూప‌ర్ స్టార్ కత్రినా కైఫ్ టైగర్ ISI ఏజెంట్ జోయా హుమైమి పాత్రలో మళ్లీ నటిస్తోంది. మనీష్ శర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. టైగ‌ర్ 3లో షారూఖ్ ఖాన్ - హృతిక్ రోషన్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. SRK ఈ చిత్రంలో పఠాన్ లోని తన పాత్రను పునరావృతం చేస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే హృతిక్ మరోసారి `వార్‌`లో పోషించిన‌ కబీర్ పాత్రను తిరిగి టైగ‌ర్ 3 సినిమాలో పోషిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇదేగాక స‌ల్మాన్ ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ షూటింగును పూర్తి చేసారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో స‌ల్మాన్ ని స‌రికొత్త లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నార‌ని స‌మాచారం. త‌ళా అజిత్ కుమార్ క‌థానాయ‌కుడిగా 2014లో విడుదలైన తమిళ చిత్రం `వీరమ్‌`కి ఇది రీమేక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తనకు ఉన్న బాధ్య‌త‌ల దృష్ట్యా పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకునే పెద్దన్నయ్య పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి- జగపతి బాబు- ఆసిఫ్ షేక్- రాఘవ్ జుయల్- జాస్సీ గిల్- సిద్ధార్థ్ నిగమ్- షెహనాజ్ గిల్ - విజేంద్ర సింగ్- పాలక్ తివారీ- మాళవిక శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏప్రిల్ 2023లో థియేటర్లలోకి రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.