Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ దెబ్బ కొట్టిందిగా

By:  Tupaki Desk   |   27 Oct 2017 6:30 AM GMT
బిగ్ బాస్ దెబ్బ కొట్టిందిగా
X
ఇండియన్ ఆడియెన్స్ కి మొట్ట మొదటిసారిగా రియాలిటీ షో రుచిని చూపించింది బాలీవుడ్. బిగ్ బాస్ షో ద్వారా అసలైన రియాలిటీ షో అంటే ఏమిటో అందరికి తెలిసింది. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షో రెంటింగ్ తార స్థాయికి చేరింది. 2013 నుంచి ఆ షోకి పోటీగా ఏ షో నిలవలేదు. రేటింగ్స్ లలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటూ వస్తోంది.

TRP లను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. బిగ్ బాస్ ని మించే వారు ఎవరు లేరని అనుకున్నారు. కానీ ఇప్పుడు TRP ని చూసి మరో విధంగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోన్న షో కి సాధారణ సీరియల్స్ కి వస్తోన్న TRP వస్తోంది. 'కుం కుం భాగ్య' వంటి సీరియల్స్ 18 టిర్పీతో దూసుకపోతుంటే.. బిగ్ బాస్ కు 10 కంటే ఎక్కువ రావట్లేదు. దీంతో షో నిర్వాహకులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. గత ఏడాది కంటే ఈ సారి కాస్త ఎక్కువ రేంజ్ లోనే ప్రమోషన్స్ చేసి. 18 కంటెస్టెంట్స్ ని ప్రవేశపెట్టారు.వారిలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకున్న వారే ఉండడం అందరిని ఆశ్చర్య పరిచింది.

మొదట బాగానే ఉన్నా ఆ తర్వాత అర్థం లేని గోడవలతో షోలో ఓవర్ యాక్షన్స్ చాలా ఎక్కువయ్యాయి. ఏ మాత్రం ఆకట్టుకోలేని వారి ప్రవర్తన పద్దతికి ఆడియెన్స్ విసిగిపోతున్నారు. అంతే కాకుండా షో ని చూస్తుంటే అస్సలు రియాలిటీగా అనిపించడం లేదు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఛానల్ మార్చేస్తున్నారు. మరి సల్మాన్ ఉంటేనే షో ఉంటుంది అని నిర్వాహకులు ఇంతకుముందు చెప్పారు. మరి సల్మాన్ భాయ్ ఏ విధంగా ప్రాణం పోస్తాడో చూడాలి.