Begin typing your search above and press return to search.

భ‌జ‌రంగీ భాయ్‌జాన్ ఫీవ‌ర్ స్టార్ట్!

By:  Tupaki Desk   |   13 July 2015 2:26 AM GMT
భ‌జ‌రంగీ భాయ్‌జాన్ ఫీవ‌ర్ స్టార్ట్!
X
బాలీవుడ్‌లో `భ‌జ‌రంగీ భాయ్‌జాన్` ఫీవ‌ర్ మొద‌లైంది. ఈద్ ని పుర‌స్క‌రించుకొని జులై 17న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. హిట్ కాంబినేష‌న్‌గా పేరు తెచ్చుకొన్న స‌ల్మాన్‌ఖాన్‌, క‌రీనా కపూర్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అందించిన క‌థ‌తో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న ఈ సినిమాపై బాక్సాఫీస్ భారీగా ఆశ‌లు పెట్టుకొంది. మంచి సిచువేష‌న్‌లో విడుద‌ల‌వుతోంది కాబ‌ట్టి సినిమా ఎన్నెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి. బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా `భ‌జ‌రంగీ భాయ్‌జాన్` సినిమా హ‌డావుడే క‌నిపిస్తోంది. స‌ల్మాన్‌, క‌రీనా ఇద్ద‌రూ క‌లిసి ప‌లు ప‌త్రిక‌ల క‌వ‌ర్‌పేజీల‌పై మెరిసిపోతున్నారు. ఫిల్మ్‌ఫేర్ క‌వ‌ర్ పేజీపై క‌రీనా, స‌ల్మాన్‌లు క‌నిపిస్తున్న విధానం అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `బాహుబ‌లి` హిందీలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. స్ర్టెయిట్ సినిమా త‌ర‌హాలో భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకొంటోంది. అయినప్ప‌టికీ స‌ల్మాన్‌ఖాన్‌, క‌రీనా క్రేజీ కాంబినేష‌న్ కావవ‌డంతో బాహుబ‌లి ప్ర‌భావం `భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌`పై ప‌డే అవ‌కాశం లేదని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అదే న‌మ్మ‌కంతోనే చిత్ర‌బృందం ఉంది. `భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌` సినిమాపై ఇప్పుడు చాలా టార్గెట్లు ఉన్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన `పీకే` భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకొంది. ఆ సినిమాని అధిగ‌మించే స‌త్తా `భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌`కి ఉంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.