Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఇంట్లో కమల్, సల్మాన్

By:  Tupaki Desk   |   12 Jun 2022 2:22 PM IST
మెగాస్టార్ ఇంట్లో కమల్, సల్మాన్
X
మెగాస్టార్ చిరంజీవి ఇతర స్టార్స్ తో ఎలాంటి సాన్నిహిత్యంతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు కూడా మెగాస్టార్ తో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కి ఒక సినిమా నచ్చింది అంటే వెంటనే ఆ చిత్ర యూనిట్ సభ్యులను కూడా ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటారు. రీసెంట్గా విక్రమ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో విశ్వనటుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా తనదైన శైలిలో గౌరవించారు.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. గత రాత్రి కమల్ హాసన్ సల్మాన్ ఖాన్ మా ఇంటికి విచ్చేశారు అంటూ ఈ సందర్భంగా వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని వివరణ ఇచ్చారు. ఇక విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

కమల్ హాసన్ తో పాటు బాలీవుడ్ నటుడు కమల్ హాసన్ కూడా రావడంతో మెగాస్టార్ ఆనందంతో ఇద్దరిని కూడా తనదైన శైలిలో రిసీవ్ చేసుకున్నారు. సినిమా అద్భుతంగా ఉంది అనే కమల్ హాసన్ కు ఇలాంటి విజయాలు మరెన్నో కలగాలని మరీంత పవర్ఫుల్ గా కూడా ఉండాలి అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవితో కమల్ హాసన్ కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మీరు గతంలో కొన్ని సినిమాలు కూడా కలిసి చేయాలని అనుకున్నారు. మధ్యలో అయితే తెలుగు లో కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించాలని ఉంది అని కూడా వివరణ ఇచ్చారు. ఇక మెగాస్టార్ పోస్ట్ చేసిన ఫోటోలు కమల్ హాసన్ సల్మాన్ ఖాన్ కూడా కనిపించడంతో పాండ్యా ఫోటో చూసినట్లుగా ఉంది అని ప్రేక్షకులు స్పందిస్తున్నారు.

ఈ ముగ్గురి కలయికలో సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని కూడా వారి ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.