Begin typing your search above and press return to search.

క్రేజీ సినిమా ఎందుకు ఆగిపోయింది

By:  Tupaki Desk   |   26 Aug 2019 10:58 AM GMT
క్రేజీ సినిమా ఎందుకు ఆగిపోయింది
X
ఓ నాలుగు నెలల క్రితమే కండల వీరుడు సల్మాన్ ఖాన్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో ఇన్షాఅల్లా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇద్దరి అభిమానులు మేఘాల్లో తేలిపోయారు. హం దిల్ దే చుక్ సనమ్ లాంటి మరో మాస్టర్ పీస్ వస్తుందని సంబరపడ్డారు. ఈ వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్న అలియా భట్ ఇందులో హీరోయిన్ గా ఎంపికయ్యింది. తన ఇంట్రో సాంగ్ తోనే స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేశారు.

కానీ ఉన్నట్టుండి ఇన్షాఅల్లా ను ఆపేశారు. కారణం చెప్పలేదు కాని సల్మాన్ ఖాన్ నుంచి భన్సాలీ క్యాంప్ నుంచి ఇదే అప్ డేట్ రావడంతో క్యాన్సిల్ అయిన విషయం అఫీషియల్ అయిపోయింది. కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ఆగిందని ముంబై రిపోర్ట్. ఇన్షాఅల్లా ఒకవేళ స్టార్ట్ అయ్యుంటే వచ్చే ఈద్ పండక్కు కానుకగా ఇవ్వాలనుకున్నాడు సల్మాన్ ఖాన్. కానీ ఇప్పుడు దాని స్థానంలో మరో సినిమాను వేగంగా పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోందట.

ప్రభుదేవా దర్శకత్వంలో సల్లు భాయ్ చేస్తున్న దబాంగ్ 3 దాని కన్నా ముందే వచ్చేస్తుంది. సో రంజాన్ సెంటిమెంట్ ని మిస్ కాకూడదు అంటే సల్మాన్ ఖచ్చితంగా ఇంకో సినిమా వేగంగా ఫినిష్ చేయాలి. ఒప్పుకోవాలే కానీ మూడు నెలల్లో తీసే దర్శకులు బాలీవుడ్ నిండా ఉన్నారు. కాకపోతే సల్లు ఇమేజ్ కు తగ్గ స్క్రిప్ట్ కుదరాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలే జరుగుతున్నాయట. మరీ ఇన్షాఅల్లా ఫ్యూచర్ లో అయినా ఉంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి