Begin typing your search above and press return to search.
సల్మాన్ - జాక్వెలిన్ రొమాన్స్ రచ్చ.. వీడియో వైరల్!
By: Tupaki Desk | 13 May 2020 2:00 PM ISTమన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంటే.. సామాన్యులు సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలసి తన పాన్వెల్ ఫామ్ హౌస్ లో లాక్ డౌన్ సమయాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ తన ఫామ్ హౌస్ లో డైలీ ఆక్టివిటీస్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఎల్లప్పుడూ తన అభిమానులకు అందుబాటులో ఉండే సల్లు భాయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సల్మాన్ ఖాన్ రోజురోజుకి తన ఫామ్‌హౌస్‌లో ఫుల్ బిజీగా అవుతున్నాడు. కొత్త ఐడియాలను, సరికొత్త పాటలను తన ఫామ్‌హౌస్‌లోనే షూట్ చేస్తూ తెరకెక్కిస్తున్నాడు. ఇదివరకే జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో కలిసి చేసిన ప్యార్ కరోనా అనే పాటను రిలీజ్ చేసిన సల్లు భాయ్.. తాజాగా 'తేరాబినా' అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసాడు. ఈ పాటను పాడడంతో పాటు సల్లు భాయ్ ఈ పాటతో డైరెక్టర్ గా కూడా మారాడు.
లాక్ డౌన్ లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక తన ఫామ్ హౌస్ లోని లొకేషన్లు సెలెక్ట్ చేసి ఆల్బమ్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ వీడియోలన్నీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. జాక్వెలిన్ తో రూపొందించిన తేరేబినా అనే రొమాంటిక్ పాటను ఫామ్ హౌస్ లో షూట్ చేసి రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ లో సల్మాన్ జాక్వెలిన్ ల రొమాన్స్ మాములుగా లేదు. ఇద్దరు కలిసి ప్యూర్ రొమాంటిక్ నెంబర్ తో.. సల్మాన్ వాయిస్ తో ఆకట్టుకుంటున్నారు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఇద్దరు ఈ పాటతో అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ మొత్తం ఫామ్ హౌస్ లోనే షూట్ చేయడం విశేషం. లాక్ డౌన్ కు ముందే.. ఫామ్ హౌస్ కు వచ్చిన సల్మాన్, హీరోయిన్ జాక్వెలిన్ అక్కడే ఇరుక్కుపోయారు. ఇక సల్మాన్ పేదలకు సాయం అందిస్తూ తన మనసు చాటుకుంటున్నాడు. ఇదివరకు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సహకారంగా సల్మాన్ నిత్యవసర వస్తువులను అందించారు. ప్రస్తుతం వీరిద్దరి రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.