Begin typing your search above and press return to search.

త‌న‌కు తెలీకుండానే స్టార్ హీరో గుట్టు ర‌ట్టు చేసింది!

By:  Tupaki Desk   |   1 March 2022 1:40 AM GMT
త‌న‌కు తెలీకుండానే స్టార్ హీరో గుట్టు ర‌ట్టు చేసింది!
X
పూజా హెగ్డే ఎగ్జ‌యిట్ మెంట్ చూస్తుంటే డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయ్. అత‌డు ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తాడు! అంటూ చెబుతోంది. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

అల వైకుంఠపురంలో చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన పూజా హెగ్డే కు బాలీవుడ్ లో అలాంటి ఒకే ఒక్క హిట్టు కావాల్సిన త‌రుణ‌మిది. హౌస్‌ఫుల్ 4, మొహంజొ దారో వంటి చిత్రాలలో న‌టించినా అవేవీ త‌న‌కు ఏ ర‌కంగానూ క‌లిసి రాలేదు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో స‌ల్మాన్ తో ద‌బాంగ్ టూర్ ఆఫ‌ర్ ద‌క్క‌డంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

టాలీవుడ్ నటి పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ - ది టూర్ రీలోడెడ్ కోసం దుబాయ్ లో ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో తాజా పర్యటన గురించి పూజా ఓపెనైంది. దుబాయ్ వేదిక‌గా తన తొలి ప్రదర్శన కోసం త‌న ఎగ్జ‌యిట్ మెంట్ ని దాచుకోకుండా మాట్లాడింది పూజా. రిహార్సల్స్ సమయంలో పూజా సల్మాన్ భాయ్ మధ్య కెమిస్ట్రీ గురించి కూడా మాట్లాడింది.

ఆమె మాట్లాడుతూ.. “సల్మాన్ .. నేను డ్యాన్స్ చేసిన వీడియో ప్రతిచోటా అప్ లోడ్ చేసారు. సల్మాన్ చాలా స్వీట్.. చాలా రియల్ గా ఉండే హీరో. అతను నిన్ను ఎప్పుడు ప్రేమిస్తున్నాడో .. ఎప్పుడు ద్వేషిస్తాడో మీరు సులభంగా చెప్పగలరు`` అని స‌ల్మాన్ భాయ్ గుట్టు బ‌య‌టపెట్టేసింది.

స‌ల్మాన్ -పూజా హెగ్డే జంట ప్ర‌స్తుతం కభీ ఈద్ కభీ దీపావళిలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా ఇంకా మాట్లాడుతూ..ప్రతిదీ దాప‌రికంగా ఉండే ప్రపంచంలో నిజమైన స్వ‌చ్ఛ‌మైన‌ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం అరుదు. అలాంటి వ్య‌క్తి స‌ల్మాన్ అని తెలిపింది. పూజా తన వద్ద ఉన్న గొప్ప చిత్రాల గురించి కూడా మాట్లాడింది. తాను విభిన్నమైన పాత్రలు పోషించడాన్ని ఇక‌పై ప్రేక్షకులు చూస్తారని చెప్పింది.

కభీ ఈద్ కభీ దీపావళి కి ఫర్హాద్ సంజీ ద‌ర్శ‌కుడు. ఇందులో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో న‌టిస్తుండ‌గా పూజా హెగ్డే -కృతి సనన్ నాయిక‌లుగా క‌నిపించ‌నున్నారు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదల కానుంది.