Begin typing your search above and press return to search.

ఇద్దరు ప్రేమ్ లు బీట్‌ చేయలేదు

By:  Tupaki Desk   |   14 Nov 2015 5:01 AM GMT
ఇద్దరు ప్రేమ్ లు బీట్‌ చేయలేదు
X
బాహుబలి రికార్డులను కదల్చడం సాధ్యం కావడం లేదు. తొలి రోజు వసూళ్లలో బాహుబలి సృష్టించిన రికార్డును.. ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీతో సల్మాన్ బద్దలు కొట్టేస్తాడనే అంచనాలు - ఆశలు వమ్మయిపోయాయి. ఫస్ట్ డే నాడు 42.1 కోట్లతో బాహుబలి చరిత్ర సృష్టించింది. ఇపుడు అంతకంటే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన సల్లూభాయ్ మూవీ.. 41 కోట్ల దగ్గర ఆగిపోయింది.

తెలుగుతో సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేసినా ప్రేమ్ మ్యాజిక్ బాహుబలి ముందు కుదరలేదు. సల్మాన్ డబుల్ రోల్ ఎఫెక్ట్ కూడా పని చేయలేదు. ఇప్పటికైతే కండలవీరుడి సినిమాకి సెకండ్ ప్లేస్ మాత్రమే దక్కింది. షారూక్ ఖాన్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్ 37 కోట్లతో మూడో స్థానంలోనూ - 33.3 కోట్లతో ధూమ్3 నాలుగో ప్లేస్ లోను - 31.82 కోట్లతో సింగం రిటర్న్స్ ఐదో స్థానంలోనూ నిలిచాయి.

డిసెంబర్ లో దిల్ వాలే అంటూ బాలీవుడ్ బాద్ షా వచ్చేస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత కాజల్ షారూక్ జంటగా నటించడంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. క్రిస్ మస్ సీజన్ లో రిలీజ్ కానుండడం.. ఈ మూవీకి అడ్వాంటేజ్. అలాగే రణ్ వీర్ కపూర్ - దీపిక పదుకొనే - ప్రియాంక చోప్రాలు నటించిన బాజీరావ్ మస్తానీపై కూడా ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఒకవేళ వీళ్లు ఏవైనా రికార్డ్స్ సాధించినా.. బాహుబలి2 వచ్చాక అవన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటున్నారు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు..