Begin typing your search above and press return to search.

ప్రేమ పావురం అమ్మ పాత్రకు సూట్ కాలేదా?

By:  Tupaki Desk   |   5 March 2020 9:45 AM GMT
ప్రేమ పావురం అమ్మ పాత్రకు సూట్ కాలేదా?
X
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రభాస్ కు తల్లి పాత్రలో పాత తరం హీరోయిన్ భాగ్య శ్రీ నటిస్తున్నారు. ఆరోజుల్లో.. ఆ కాలంలో సల్మాన్ యువకుడిగా ఉన్నప్పుడు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'మైనే ప్యార్ కియా' లో భాగ్యశ్రీ హీరోయిన్. ఆ సినిమా తెలుగులో 'ప్రేమ పావురాలు' టైటిల్ తో రిలీజై సూపర్ హిట్ అయింది.

భాగ్యశ్రీ ఇప్పటికే స్లిమ్ గా అదే గ్లామర్ తో కనిపిస్తోంది. భాగ్యశ్రీ ఈ సినిమాలో నటించడం కొత్తగా ఉంటుందని ఫిలింమేకర్స్ భావించారట. అయితే ఈ సినిమా యూనిట్ మెంబర్స్ మాత్రం భాగ్యశ్రీ ఎంపిక తేడా కొట్టిందని అంటున్నారు. భాగ్యశ్రీ వయసు తక్కువగా కనిపిస్తోందని.. ప్రభాస్ కు తల్లిగా అంటే నమ్మడం కష్టమని అంటున్నారు. భాగ్యశ్రీ లేటెస్ట్ ఫోటోలు చూసినవారికి అది నిజమే అనిపించక మానదు. అయితే డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రం భాగ్యశ్రీ ఈ సినిమా కు ఒక ప్లస్ పాయింట్ గా ఉంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

అయితే ఎవరి వెర్షన్ నిజమో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాలి. ఈ సినిమాకు 'జాన్'.. 'ఓ డియర్'.. 'రాధేశ్యామ్' పేర్లు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వచ్చాయి కానీ ఏ టైటిల్ ను ఫైనలైజ్ చేశారో మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్.. గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.