Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో సంచలనం సృష్టించిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   23 April 2020 6:00 PM IST
ట్విట్టర్ లో సంచలనం సృష్టించిన స్టార్ హీరో
X
సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అంతేగాక ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన వర్క్ డెడికేషన్ ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సల్లు భాయ్ కి ఐదు పదుల వయసు ఉన్నప్పటికీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇక ప్రేమ వ్యవహారాలు నడిపాడని వార్తలు వచ్చినా అవి పెళ్లిపీటల వరకు వెళ్లలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. సల్మాన్ భాయ్ రీసెంట్ గా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాల పరంగా కాదండి ట్విట్టర్ పరంగా.. తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ గా 40 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన రెండో సినీ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేసాడు.

ఇప్పటివరకు ట్విట్టర్లో 41.49 మిలియన్ల ఫాలోయింగ్ తో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ 40మిలియన్ల ఫాలోవర్స్ ని చేరుకొని రెండో స్థానంలో నిలిచాడు. ఇక సల్మాన్ భాయ్ తర్వాత 3వ స్థానంలో షారుఖ్ ఖాన్(39.9మిలియన్స్) ఉన్నారు. దీన్ని బట్టే చెప్పేయొచ్చు సల్మాన్ భాయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట. కబీ ఈద్ కబీ దివాలి, బుల్బుల్ మ్యారేజ్ హాల్, రాధే వరుసలో ఉన్నాయని తెలుస్తుంది. ఏదేమైనా కండలవీరుడు సల్మాన్ ఖాన్ దేశంలో ట్విట్టర్ ఖాతాకు సంబంధించి రెండో స్థానంలో నిలవడం నిజంగా అభినందించదగ్గ విషయం.