Begin typing your search above and press return to search.

సల్మాన్ భాయ్ 'విలన్'గా రొమాంటిక్ హీరో..!

By:  Tupaki Desk   |   25 May 2021 9:00 AM IST
సల్మాన్ భాయ్ విలన్గా రొమాంటిక్ హీరో..!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు గ్యాప్ లో చాలా భారీ సినిమాలు సెట్స్ పైకి వెళ్లాయి. దాదాపు ఏడాది తర్వాత అవకాశం రావడంతో స్టార్ హీరోస్ నుండి అప్ కమింగ్ హీరోస్ వరకు అందరూ తమ సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేసేసారు. అందులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ - కత్రినాకైఫ్ జంటగా నటించిన సూపర్ హిట్ టైగర్ సిరీస్ కూడా పట్టాలెక్కిందని అందరికి తెలిసిందే. 2012లో విడుదలైన ఏక్ థా టైగర్.. తర్వాత 2017లో టైగర్ జిందా హై సిరీస్ సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ప్రస్తుతం ఆ టైగర్ సిరీస్ నుండి 3వ పార్ట్ తెరకెక్కించనున్నారు. అలాగే టైగర్ 3 మూవీతో తెరమీదకు రావడానికి సల్మాన్ - కత్రినా కూడా సిద్ధం అవుతున్నారు.

ఆల్రెడీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసేందుకు షెడ్యూల్ సెట్ చేసుకున్నారు. అలాగే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారట.. మార్చిలోనే మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ భారీ యాక్షన్ మూవీ సెకండ్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి లేకపోతే ఈపాటికి మరో షెడ్యూల్ జరుగుతూ ఉండేది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ ఇద్దరూ భారీ యాక్షన్ సన్నివేశాల గురించి ప్రిపరేషన్ ప్రారంభించారు. ఆ మధ్యలో 14 రోజులపాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అప్పుడే కత్రినా కైఫ్ ఇప్పటికే దక్షిణ కొరియా స్టంట్ కళాకారులతో యాక్షన్ షూట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కత్రినా కైఫ్ కఠోరదీక్షతో సాధన చేస్తూ అమ్మడు తన క్యారెక్టర్ కోసం రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమాలో కత్రినాకు ట్రైనర్ గా దక్షిణ కొరియా స్టంట్ మాస్టర్ ఉండగా.. సల్మాన్ కు దక్షిణాఫ్రికా స్టంట్ మాస్టర్ ప్రాక్టీస్ చేయించినట్లు తెలిసింది. అయితే సినిమాకోసం కత్రినా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంటోంది. కత్రినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం టైగర్ 3 మూవీకి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ఫస్ట్ నుండి టైగర్ సిరీస్ దర్శకులు మారుతున్నారు. ఏక్ థా టైగర్ మూవీని కబీర్ ఖాన్ రూపొందించగా.. టైగర్ జిందాహైని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించాడు. ఇప్పుడు మనీష్ శర్మ మూడో సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ గురించి క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఎదుర్కొనే విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి స్టార్స్ ఫైట్ ఎలా ఉండబోతుందో..!