Begin typing your search above and press return to search.

గూగుల్‌ సాఫ్ట్‌ వేర్‌ ఎంప్లాయి కంటే ఆ హీరోయిన్ బాడీగార్డ్‌ కే ఎక్కువ జీతం

By:  Tupaki Desk   |   8 July 2021 8:30 AM GMT
గూగుల్‌ సాఫ్ట్‌ వేర్‌ ఎంప్లాయి కంటే ఆ హీరోయిన్ బాడీగార్డ్‌ కే ఎక్కువ జీతం
X
అత్యధిక జీతం వచ్చే ఉద్యోగం అనగానే ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం అంటూ ఉంటారు. నెలకు లక్షల జీతం రావాలంటే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి అయితేనే సాధ్యం అవుతుంది. ఇక సాఫ్ట్‌ వేర్ కంపెనీల్లో అత్యధిక జీతం ఇచ్చే కంపెనీల్లో గూగుల్‌ ముందు ఉంటుంది. ఏడాదికి 50 నుండి 60 లక్షలు అంతకు మించి జీతాలు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు మాత్రమే లభిస్తుంది. అలాంటి జీతం ఒక బాడీ గార్డ్ కు వస్తుంది అంటే మీరు నమ్ముతారా.. నిజంగా ఒక బాడీ గార్డ్‌ కు ఏడాదికి 80 లక్షల జీతం వస్తుంది. ఆ బాడీ గార్డ్ ఎవరు.. అతడి కథ ఏంటీ అనేది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే కు చాలా ఏళ్లుగా బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు జలాల్. అతడికి దీపిక ప్రస్తుతం నెలకు రూ.6.5 లక్షల జీతం ఇస్తుందట. అతి తక్కువ జీతం నుండి అతడు దీపిక వద్ద పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏడాదికి 80 లక్షల జీతంతో పాటు పండగలకు ప్రత్యేక రోజులకు బహుమానాలతో కలిపి ఏడాదికి కోటి వరకు దక్కించుకుంటున్నాడట. ఒక బాడీ గార్డ్ కు ఇంత జీతం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఉంటుందా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

దీపిక అడుగు బయట పెడితే జలాల్ ఆమె పక్కన ఉండాల్సిందేనట. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం కూడా జలాల్ చూసుకుంటూ ఉంటాడు. దీపికకు అతడు అంటే ప్రత్యేకమైన అభిమానం అని కూడా అంటూ ఉంటారు. పెళ్లి తర్వాత కూడా అతడిని తన బాడీ గార్డ్‌ గా కంటిన్యూ చేస్తుంది అంటే జలాల్ పై ఎంతటి అభిమానం ఆమెకు ఉందో అర్థం చేసుకోవచ్చు. తన సొంత మనిషిగా ఆయన్ను చూసుకోవడంతో పాటు ఎన్నో సార్లు లక్షల రూపాయల విలువ చేసే బహుమానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జాలాల్‌ కు ఇల్లు ను కూడా బహుమానంగా ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దీపిక పదుకునే ప్రస్తుతం బాలీవుడ్‌ అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న కారణంగా తన బాడీ గార్డ్‌ కు అత్యధికంగా జీతం ఇస్తుంది. తన స్టార్ స్టేటస్ కు ఇది నిదర్శణంగా చెప్పుకుంటున్నారు.