Begin typing your search above and press return to search.

#స‌లార్‌: 1970 కాలంలో మాఫియా పోరాటాల క‌థ‌తో

By:  Tupaki Desk   |   6 July 2021 6:39 AM GMT
#స‌లార్‌: 1970 కాలంలో మాఫియా పోరాటాల క‌థ‌తో
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్-`కేజీఎఫ్` ఫేం ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో `స‌లార్` తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. మ‌రో కీల‌క పాత్ర‌కు వాణీ క‌పూర్ ని తీసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇండియాలోనే ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. దీనిలో భాగంగా హైద‌రాబాద్- బెంగుళూరు- మైసూరు లోనే మేజ‌ర్ షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని తెలుస్తోంది.

మూవీలో కొన్ని స‌న్నివేశాల కోసం ఏకంగా 1970 కాలాన్ని స్ఫుర‌ణ‌కు తెచ్చేలా సెట్స్ వేయ‌నున్నార‌ని ఇందులో కీల‌క షెడ్యూల్ ని చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. నాటి కాలాన్ని త‌ల‌పించేలా అద్భుత‌మైన సెట్ ని మైసూర్ లో నిర్మించ‌డానికి రెడీ అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆర్ట్ వ‌ర్క్ టీమ్ ని దించుతున్న‌ట్లు స‌మాచారం. అక్క‌డ కీల‌క మైన యాక్ష‌న్ సీక్వెన్స్ ని చిత్రీక‌రించ‌డానికి ఆ సెట్ ని వినియోగించ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే 1970 కాలానికి చెందిన ఓ బైక్ ని కూడా ప్ర‌భాస్ కోసం సిద్దం చేయించారు. ఈ బైక్ ని యాక్ష‌న్ స‌న్నివేశాల్లో హైలైట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

యాక్ష‌న్ స‌న్నివేశాల్లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ సీన్స్ కోసం భారీ ఎత్తున పేలుడు ప‌దార్థాలు కూడా వాడుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ ని ఈ చిత్రంలో మోస్ట్ వ‌యోలెంట్ మేన్ గా చూడ‌బోతున్నార‌ని ప్ర‌శాంత్ నీల్ వెల్ల‌డించారు. మునుపెన్న‌డూ చూడ‌ని కొత్త గెట‌ప్ లో ప్ర‌భాస్ స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

2022 స‌మ్మ‌ర్ నాటికి స‌లార్ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని హోంబ‌లే సంస్థ భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టు షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా షెడ్యూల్స్ కి ఇప్ప‌టికే ఇబ్బంది త‌ప్ప‌లేదు. మునుముందు థ‌ర్డ్ వేవ్ వ‌స్తే.. మ‌ళ్లీ షూటింగుల‌కు ఆటంకాలు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ జ‌రుపుకున్న `స‌లార్` త‌దుప‌రి షెడ్యూల్ ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది.