Begin typing your search above and press return to search.

రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో సలార్..!

By:  Tupaki Desk   |   21 April 2021 2:30 AM GMT
రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో సలార్..!
X
కేజీఎఫ్ అనే ఒక్కసినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా వైడ్ స్టార్డం అందుకున్నాడు. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకుతో తెలిసిపోతుంది అన్నట్టుగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఒక్క సినిమాతోనే తన సూపర్ విజన్ చూపించాడు. ఎప్పటినుండో పాన్ ఇండియా ఫేమ్ కోసం చాలా ఏళ్లుగా ట్రై చేస్తుండగా కేవలం కేజీఎఫ్ తో ఆ ఫేమ్ దక్కించుకోవడం విశేషం. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా ఫినిష్ చేసాడు ప్రశాంత్.. ఆ సినిమా జులై నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే కేజీఎఫ్-2 సినిమా పూర్తయిందో లేదో డైరెక్టర్ ప్రశాంత్ - ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు. పాన్ ఇండియా స్టార్ తో సినిమా అనేసరికి అందరూ సూపర్ ఎక్సయిటెడ్ అయిపోయారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి సలార్ సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటంటే.. సలార్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని సినీ ఇండస్ట్రీలో పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని టాక్. అయితే ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్ ఓ రియల్ జర్నలిస్ట్ లైఫ్ ను స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీని పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా.. ఒకవేళ జర్నలిస్ట్ క్యారెక్టర్ అయితే మాత్రం శృతికి ఈ పాత్ర చేయడం రెండోసారి అవుతుంది. ఎందుకంటే ఇదివరకు సింగం-3 లో శృతి ఆ క్యారెక్టర్ ప్లే చేసింది. ఇక సినిమాలో సలార్ గా డార్లింగ్ ప్రభాస్ గురించి కూడా కొన్ని ఊహగానాలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి పుకార్లకు మేకర్స్ చెక్ పెడతారేమో!