Begin typing your search above and press return to search.

'సలార్' రీమేక్ సినిమా కాదు: ప్రశాంత్ నీల్

By:  Tupaki Desk   |   4 Feb 2021 5:30 PM GMT
సలార్ రీమేక్ సినిమా కాదు: ప్రశాంత్ నీల్
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖనిలో ప్రారంభమైంది. అయితే ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి ఇది ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్' రీమేక్ అనే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ఓ డైలీతో మాట్లాడుతూ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు. "సలార్ రీమేక్ అని వస్తున్న వార్తా కథనాలను నేను కూడా చదివాను. ఇది నా మునుపటి చిత్రం ఉగ్రమ్ యొక్క రీమేక్ కాదు. ఇది ఏ హాలీవుడ్ లేదా బాలీవుడ్ హిట్ సినిమా ఆధారంగా తీయడంలేదు. నా ఒరిజినల్ ఐడియాతో ప్రభాస్ కోసం ఈ కథ ప్రత్యేకంగా రాసుకున్నాను'' అని చెప్పి ప్రశాంత్ నీల్ రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇకపోతే 'సలార్' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.