Begin typing your search above and press return to search.

రెబ‌ల్ క‌టౌట్ కి కంటెంట్ కి త‌గ్గ‌కుండా ధీటుగా

By:  Tupaki Desk   |   8 July 2021 6:32 AM GMT
రెబ‌ల్ క‌టౌట్ కి కంటెంట్ కి త‌గ్గ‌కుండా ధీటుగా
X
ఆ ఇద్ద‌రు క‌లిస్తే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే అభిమానుల‌ అంచ‌నాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ప్ర‌శాంత్ నీల్ తొలి సినిమా కేజీఎఫ్ తోనే ఇండియాలోనే టాప్ రేంజ్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా పేరు సంపాదించారు. ఇదంతా కేవ‌లం ప్ర‌శాంత్ నీల్ క్రియేటివిటీ... హీరోయిజాన్ని ఎలివేట్ చేసే తీరు... పాత్ర‌కు త‌గ్గ‌ట్టు క‌థానాన్ని మ‌లుచుకునే వైనం ప్ర‌ధాన కార‌ణం.

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లాంటి రెబ‌ల్ క‌టౌట్ కు ధీటైన విల‌న్ కూడా అంతే అవ‌స‌రం. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ అదే పనిలో సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ పాత్ర కోసం త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి పేరు వినిపించింది. కానీ ఆయ‌న‌కు కాల్షీట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో స్కిప్ అవ్వాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాదికి చెందిన మ‌రో సీనియ‌ర్ న‌టుడిని రంగంలోకి దించాల‌ని ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. కోలీవుడ్ కి చెందిన ఓ సీనియ‌ర్ న‌టుడినే ఎంపిక చేస్తున్న‌ట్లు...ఇప్ప‌టికే అత‌ని వ‌ద్ద‌కు స‌లార్ స్క్రిప్ట్ కూడా వెళ్లిన‌ట్లు ప‌రిశ్రమ వ‌ర్గాల టాక్. అయితే ఆయ‌న ఎవ‌రు? అన్న‌ది మాత్రం ఇంకా రివీల్ చేయ‌లేదు. బ‌హుశా స‌లార్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టిస్తుంద‌నే ఆశిస్తున్నారు.

ఇక ఇందులో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కూడా ఆషామాషీగా ఉండ‌ద‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. రెగ్యుల‌ర్ విల‌న్ కు భిన్నంగా చాలా ఫ‌వ‌ర్ ఫుల్ గా...ప్ర‌శాంత్ నీల్ క్రియేటివీటీకి.. ప్ర‌భాస్ క‌టౌట్ కి ఎంత మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని అంటున్నారు. విల‌న్ పాత్ర‌కు పెద్ద కుటుంబ నేప‌థ్యం ఉంటుంద‌ని..అలాగే ఆ పాత్ర‌కు బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ భార్య పాత్ర‌కు తీసుకునేలా సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. కొంత మంది బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుల పేర్లు కూడా ద‌ర్శ‌కుడి దృష్టిలో ఉన్నాయ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇండియాలోనే ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. దీనిలో భాగంగా హైద‌రాబాద్- బెంగుళూరు- మైసూరు లోనే మేజ‌ర్ షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని తెలుస్తోంది. మూవీలో కొన్ని స‌న్నివేశాల కోసం ఏకంగా 1970 కాలాన్ని స్ఫుర‌ణ‌కు తెచ్చేలా సెట్స్ వేయ‌నున్నార‌ని ఇందులో కీల‌క షెడ్యూల్ ని చిత్రీక‌రిస్తార‌ని తెలిసింది. నాటి కాలాన్ని త‌ల‌పించేలా అద్భుత‌మైన సెట్ ని మైసూర్ లో నిర్మించ‌డానికి రెడీ అవుతున్నారు. అక్క‌డ కీల‌క మైన యాక్ష‌న్ సీక్వెన్స్ ని చిత్రీక‌రించ‌డానికి ఆ సెట్ ని వినియోగించ‌నున్నార‌ని స‌మాచారం. అలాగే 1970 కాలానికి చెందిన ఓ బైక్ ని కూడా ప్ర‌భాస్ కోసం రప్పిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ ని ఈ చిత్రంలో మోస్ట్ వ‌యోలెంట్ మేన్ గా చూడ‌బోతున్నార‌ని.. మునుపెన్న‌డూ చూడ‌ని కొత్త గెట‌ప్ లో ప్ర‌భాస్ స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

స‌లార్ చిత్రాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తాన‌ని ప్ర‌శాంత్ నీల్ మాటిచ్చారు. దానికి త‌గ్గ‌ట్టే త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసి క‌నీసం వ‌చ్చే సంక్రాంతికి అయినా రిలీజ్ చేయాల‌ని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సెకండ్ వేవ్ ప్ర‌భావంతో షూటింగ్ ఆల‌స్య‌మైంది కాబ‌ట్టి స‌మ్మ‌ర్ కే అవ‌కాశం ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.