Begin typing your search above and press return to search.

స‌లార్ వ‌ర్సెస్ ఆదిపురుష్‌.. వాట్ నెక్ట్స్..?

By:  Tupaki Desk   |   6 Aug 2021 11:30 PM GMT
స‌లార్ వ‌ర్సెస్ ఆదిపురుష్‌.. వాట్ నెక్ట్స్..?
X
ఓవైపు ఆదిపురుష్‌.. మ‌రోవైపు సలార్.. ఈ రెండిటి న‌డుమ ప్రాజెక్ట్-కె.. ప్ర‌భాస్ షెడ్యూల్స్ చూస్తుంటే ఔరా! అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. రాధేశ్యామ్ చిత్రాన్ని 2022 సంక్రాంతికి వాయిదా వేసి రిలాక్స్ డ్ గా మూడు సినిమాల చిత్రీక‌ర‌ణ‌ల‌తో బిజీ అయ్యాడు డార్లింగ్. అస‌లింత‌కీ ఏ సినిమా స్టాట‌స్ ఎలా ఉంది? అన్న‌దానిపై ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ 3డి.. స‌లార్ చిత్రీక‌ర‌ణ‌ల కోసం అటూ ఇటూ హ‌డావుడిగా ప్ర‌యాణిస్తున్నారు. ప్రభాస్ ఇటీవల సలార్ సెట్స్ లో చేరిన సంగతి తెలిసిందే. యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు.. శృతి హాసన్ ఈరోజు సలార్ సెట్స్ లో చేరింది. ఆమె తన పోర్షన్ కోసం షూటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తో ఆమె కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్ర‌శాంత్ నీల్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నారు. ఆగష్టు నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్ లో గణనీయమైన భాగాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. స‌లార్ తాజా షెడ్యూల్ పూర్త‌వ్వ‌గానే వెంట‌నే ఆదిపురుష్ 3డి చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటాడు. అతను ఈ సెప్టెంబర్ ప్రారంభంలో ఓం రౌత్ దర్శకత్వం లోని ఆదిపురుష్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాడు. కానీ డార్లింగ్ దృష్టి ఇప్పుడు పూర్తిగా సాలార్ పైనే... స‌లార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో ప్ర‌భాస్ భ‌యంక‌ర‌మైన డాన్ పాత్ర‌లో క‌నిపిస్తారు.

అక్క‌డ ప్ర‌భాస్ లేని షాట్ల చిత్రీక‌ర‌ణ‌:

ప్ర‌భాస్ స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీ కాగానే.. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ కి ప్రభాస్ షాట్స్ లేని షూట్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నార‌ట‌. ఆదిపురుష్ 3డి మునుపెన్న‌డూ భార‌తీయ స్క్రీన్ పై చూడ‌నంతటి భారీ సినిమా. కేవ‌లం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోస‌మే షూటింగ్ కాకుండా ఏడాది ప‌ని చేయాల్సి ఉంటుంద‌ట‌. అందుకే 2022 చివ‌రి వ‌ర‌కూ ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ రాద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగష్టు నాటికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ లో ఉన్నా రిలీజ్ సాధ్య‌మేనా కాదా? అన్న‌ది కాస్త వేచి చూడాలి.

ఐట‌మ్ నంబ‌ర్ లో కిల్ల‌ర్ లేడీ

ప్ర‌భాస్ స‌లార్ చిత్రంలోనూ అదిరిపోయే ఐట‌మ్ నంబ‌ర్ ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఐట‌మ్ నంబ‌ర్ కోసం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీ‌నిధి శెట్టిని బ‌రిలో దించుతున్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. ఏకంగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ ని బ‌రిలో దించాల‌ని ప్ర‌శాంత్ నీల్ బృందం స‌న్నాహ‌కాల్లో ఉందిట‌. 37 ఏజ్ లోనూ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తున్న‌ కత్రిన నిరంత‌ర‌ జిమ్ తో ఫిట్ అండ్ హాట్ గా త‌యారైన సంగ‌తి తెలిసిన‌దే. తిరిగి ట్రాక్ లో ప‌డ్డ క‌త్రిన కిరాక్ పుట్టించే అందాల‌తో మ‌రోసారి అల‌రిస్తోంది. ఇక ఐట‌మ్ నంబ‌ర్ల‌తోనూ మ‌ళ్లీ కిక్కు పుట్టించేందుకు రెడీ అవుతుండ‌డం ఆస‌క్తిక‌రం.