Begin typing your search above and press return to search.

'సలార్' ఫోటోలు లీక్.. ఈ కటౌట్ కి నీల్ ఎలివేషన్స్ పడితేనా..!

By:  Tupaki Desk   |   19 April 2022 8:30 AM GMT
సలార్ ఫోటోలు లీక్.. ఈ కటౌట్ కి నీల్ ఎలివేషన్స్ పడితేనా..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిజానికి నీల్ 'కేజీయఫ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తో మూవీ ప్రకటించినప్పటి నుంచే ఫ్యాన్స్ దీని కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ ను ఊర మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ వచ్చేసింది.

అయితే ఇప్పుడు ప్రశాంత్ 'కేజీయఫ్ 2' చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టడంతో.. ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' సినిమాపై అందరి దృష్టి పడింది. సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ - ఎలివేషన్స్ ని ఊహించుకుంటూ అభిమానులు తమ ఎగ్జైట్మెంట్ ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'సలార్' సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా నిమిషాల్లోనే వైరల్‌ గా మారుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి లేటెస్టుగా షూటింగ్ స్పాట్‌ లోని కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.వీటిల్లో ప్రభాస్ మాస్ లుక్‌ తో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

మాస్ అంటే ఏంటో.. అది ఎలా ఉంటుందో ఈ సినిమాతో బాక్సాఫీస్ కు డార్లింగ్ చూపిస్తాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కటౌట్ కి నీల్ ఎలివేషన్స్ పడితే నెక్స్ట్ లెవల్ లో ఉందని అంటున్నారు. 'కేజీఎఫ్ 2' కి మించిన మాస్ ని 'సలార్' మూవీలో చూడబోతున్నామనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా మాకో హీరో నుండి సరైన మాస్ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్నారు. 'సలార్' వారి కోరికలను పూర్తి చేస్తుంది'' అని రచయిత పేర్కొన్నారు. ఇకపోతే మే నెలాఖరున ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలానే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

'సలార్' చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు విలన్ రోల్ లో కనిపించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. 2023 సమ్మర్‌ సీజన్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ గా అవతరించిన ప్రభాస్.. 'కేజీఎఫ్' సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్‌ గా మారిన ప్రశాంత్ నీల్ కలసి ''సలార్'' చిత్రంతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.