Begin typing your search above and press return to search.

సలార్ బడ్జెట్ 250 అనుకుంటే 400 కోట్లు అయ్యిందే!

By:  Tupaki Desk   |   21 Jan 2023 3:30 PM GMT
సలార్ బడ్జెట్ 250 అనుకుంటే 400 కోట్లు అయ్యిందే!
X
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు నుంచి అప్డేట్ కోసం అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులు కూడా ఎక్సైట్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందాని అంతా చూస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు మా ప్రభాస్ సినిమా వస్తుందో అని తెగ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా నుంచి కనీసం టీజర్ అయిన రిలీజ్ చేయండి బాబోయ్ అంటూ... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజా విషయం ఏమిటంటే... ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అనుకున్నారు. ఈ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయాలి అనుకుంటే... ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది అని తెలుస్తోంది. ఏకంగా 400 కోట్లకు చేరింది. అయితే సలార్ 2 పార్ట్స్ కలిపి ఈ బడ్జెట్ వచ్చిందని అంటున్నారు. మరి ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందా అని ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ మొదటి సారిగా నటిస్తుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే. ప్రభాస్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా ప్రకటించారు.. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలతో జోష్ మీద ఉన్న శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు మేకర్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.