Begin typing your search above and press return to search.

స‌లార్ గ్లింప్స్ KGF2తో.. అవ‌న్నీ రూమ‌ర్లే!

By:  Tupaki Desk   |   10 April 2022 10:00 AM IST
స‌లార్ గ్లింప్స్ KGF2తో.. అవ‌న్నీ రూమ‌ర్లే!
X
సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాల వెల్లువ కొన‌సాగుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ఇటీవ‌ల విడుద‌లై ఇంటా బ‌య‌టా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 1000 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు కేజీఎఫ్ 2 వ‌స్తోంది! అంటూ ప్ర‌చారం సాగుతోంది.

క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఏ మేర‌కు మైలేజ్ ని అందుకుంటుందో చూడాల‌న్న ఆస‌క్తి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ఉంది. ఆర్.ఆర్.ఆర్ వేవ్ లో ఇప్పుడు కేజీఎఫ్ 2 కి కూడా క్రేజ్ పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. హిందీ బెల్ట్ లో ఆర్.ఆర్.ఆర్ ని మించిన క్రేజ్ తో కేజీఎఫ్ 2 విడుద‌ల‌వుతోంది.

ఇదంతా ఇలా ఉండ‌గానే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 రిలీజ్ తో పాటు ప్ర‌శాంత్ నీల్ #స‌లార్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం సాగిపోతోంది. కేజీఎఫ్ 2 వీక్ష‌కులంద‌రికీ రిజిస్ట‌ర్ అయ్యేలా ప్ర‌భాస్- స‌లార్ గ్లింప్స్ ట్రీటిస్తుంద‌ని కూడా జోరుగా ప్ర‌చారం ఊపందుకుంది. అయితే ఇందులో నిజం ఎంత‌? అంటే.. అదంతా అస‌త్య‌ప్ర‌చారం అని తేలిపోయింది. ఇవ‌న్నీ కేవ‌లం రూమ‌ర్లు మాత్ర‌మే. స‌లార్ గ్లింప్స్ ఇంకా రిలీజ్ చేయ‌రు అని కూడా చెబుతున్నారు. స‌రైన స‌మ‌యంలో మంచి ముహూర్తం చూసుకుని స‌లార్ గ్లింప్స్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని కూడా వెల్ల‌డైంది.

సలార్ .. పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్

డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి మూడు సినిమాల షెడ్యూళ్ల‌ను అత‌డు మ్యానేజ్ చేస్తున్నాడు. ఓవైపు ఆదిపురుష్ 3డి మ‌రోవైపు స‌లార్ చిత్రాల‌తో బిజీ అయిన ప్ర‌భాస్ ఇంత‌లోనే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చిత్రీక‌ర‌ణ‌లోనూ పాల్గొంటున్నారు. ఆదిపురుష్ 3డి చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా.. నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. స‌లార్ చిత్రీక‌ర‌ణ మెజారిటీ పార్ట్ పూర్త‌యింది. నాగ్ అశ్విన్ తో షూటింగ్ జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాల్లో ఏ మూవీ కోసం డార్లింగ్ అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు? అంటే.. దేనిక‌దే ప్ర‌త్యేకం. కానీ కేజీఎఫ్ ద‌ర్శ‌కుడి నుంచి వ‌స్తున్న స‌లార్ పై ఎంతో క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమాగా స‌లార్ సంచ‌ల‌నాలు మ‌రో లెవల్లో ఉంటాయ‌ని భావిస్తున్నారు. స‌లార్ ప్ర‌త్యేక‌త ప్ర‌భాస్ అభిమానుల‌కు.. మాస్ ఆడియెన్ కి ఫుల్ మీల్స్ ట్రీటిస్తుంద‌ని అంచ‌నా. ప్ర‌త్యేకించి తెలుగు ప్రేక్ష‌కులు చాలా కాలంగా ప్ర‌భాస్ నుంచి వేచి చూస్తున్న జానర్ ఇదే. ఆగ‌స్టులో రానున్న ఈ చిత్రం ఆదిపురుష్ 3డి కంటే విభిన్న‌మైన‌ది.

ఇక‌పోతే ప్ర‌భాస్ ఎంపిక‌లు దేనిక‌దే యూనిక్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌లార్ మాస్ యాక్ష‌న్ కంటెంట్ తో మాఫియా నేప‌థ్యంలో సాగ‌నుండ‌డంతో ప్ర‌త్యేక క్రేజ్ నెల‌కొంది.