Begin typing your search above and press return to search.

బ‌స్తీ సెట్లో స‌లార్.. గుర్రాలపై వీర‌మ‌ల్లు స్వారీ!

By:  Tupaki Desk   |   30 Oct 2022 4:00 PM IST
బ‌స్తీ సెట్లో స‌లార్.. గుర్రాలపై వీర‌మ‌ల్లు స్వారీ!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `స‌లార్` శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న టీమ్ త‌దుప‌రి షెడ్యూల్ సైతం అంతే వేగంగా ముగించే ప‌నిలో ఉంది. దీనిలో భాగంగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన బ‌స్తీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ తో పాటు ఇత‌ర తారాగాణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీ్క‌రిస్తున్నారు. మ‌రికొన్ని రోజుల పాటు ఇక్క‌డ నిర‌వ‌ధికంగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అంద‌కు త‌గ్గ అన్ని ఏర్పాట్లు టీమ్ సిద్దం చేసింది. టీమ్ కి ఎలాంటి ఆట‌కం ఏర్ప‌డ‌కుండా ...స‌మ‌యం వృద్ధా కాకుండా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భాస్ ఇన్ టైమ్ లో షూటింగ్ స్పాట్ కి చేరుకోవ‌డం నుంచి షూటింగ్ పూర్త‌యినా అక్క‌డే కాసేపు ఉండి టీమ్ తో స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడుట‌. త‌న‌దైన శైలి నాన్ వెజ్ వంట‌కాలు మ‌ళ్లీ అంద‌రికీ రుచి చూపిస్తున్నారుట‌. ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోన్న శ్రుతి హాస‌న్ ఇప్ప‌టికే త‌న పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అలాగే `స‌లార్` షూటింగ్ ప‌క్క‌నే ప‌వ‌ర్ స్టాన్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థ‌నాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్ కూడా జ‌రుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలోనే కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలిసింది. గుర్రాల‌తో పాటు సాగే ఓ పోరాట ఘ‌ట్టాన్ని తెర‌కెక్కిస్తున్నారుట‌. దీనిలో భాగంగా సెట్లో రోజు అధిక సంఖ్య‌లో గుర్రాలు...యూనిట్ స‌భ్యులు క‌నిపిస్తున్న‌ట్లు స‌మాచారం.

సినిమాలో ఈ గుర్ర‌పు స‌న్నివేశాలు హైలైట్ గా ఉంటాయ‌ని అంటున్నారు. పీకే గుర్రాల‌పైకెక్కి చేస్తోన్న స్వారీ సీన్స్ సినిమాకి పిల్ల‌ర్ లా నిలుస్తాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఈ స‌న్నివేశాల్ని క్రిష్ త‌న‌దైన క్రియేటివిటీలో ఎలివేట్చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న నిధి అగ‌ర్వాల్ పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇలా రెండు సినిమా షూటింగ్ లు ప‌క్క‌పక్క‌నే జ‌ర‌గ‌డం విశేషం. మ‌రి ప్ర‌భాస్-పీకేలు ఒక‌రికొక‌రు క‌లుసుకున్నారో? లేదో.