Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప‌తియే ప్ర‌త్య‌క్ష దైవం .. ఇంత‌క‌న్నా రుజువేది?

By:  Tupaki Desk   |   20 April 2020 9:45 AM IST
ఫోటో స్టోరి: ప‌తియే ప్ర‌త్య‌క్ష దైవం .. ఇంత‌క‌న్నా రుజువేది?
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తితో స‌మాజంలో కొన్ని మంచి ప‌నులు కూడా చోటు చేసుకుంటున్నాయి అన్న‌ది వాస్త‌వం. దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం త‌గ్గుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస‌రాలు ప‌రిశుభ్ర‌మ‌వుతున్నాయి. ఉద్యోగం..ప‌ని అంటూ రోజు ఏదో టెన్ష‌న్ తో ఉండే జ‌నం ఇప్పుడా ఆ టెన్ష‌న్ కు దూరంగా జీవితాన్ని గ‌డుపుతున్నారు. కుటుంబానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌గలుగుతున్నారు. బంధాలు.. బాంధ‌వ్యాలు గుర్తుకొస్తున్నాయి. ఒకరినొక‌రు అర్ధం చేసుకోవ‌డానికి కోవిడ్-19 మంచి వేదిక అయింది.

దేశంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో ఇలాంటి ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణ నెల‌కొంది. సెల‌బ్రిటీలు...క్రికెట‌ర్లు ఈ లాక్ డౌన్ ని మ‌రింత జాయ్ ఫుల్ గా మార్చేసుకున్నారు. నిత్యం క్ష‌ణం తీరిక లేకుండా బిజీగా ఉండే వాళ్ల జీవితాల్లో ఈ లాక్ డౌన్ మ‌ర్చిపోలేనిదే. తాజాగా మాజీ సార‌థి ధోని... త‌న‌ భార్య సాక్షి సేవ‌లో మునిగి తేలుతున్నాడు. ఎంచ‌క్కా ఫ్యామిలీతో రాంచీలోని త‌న ఫామ్ హౌస్ కు చేరుకుని అక్క‌డే ఎంజాయ్ మెంట్ ని ఇదిగో ఇలా వెతుక్కుంటున్నాడు. అక్క‌డి అప్ డేట్స్ ని అన్నింటిని సాక్షి అభిమానులకు అందిస్తూ ఉత్సాహ‌ప‌రుస్తోంది.

నిన్న ఫామ్ హౌస్ ప‌రిస‌రాల‌ను ప‌రిచ‌యం చేసిన సాక్షి తాజాగా భ‌ర్త‌కు సేవ‌లు చేస్తున్న సంగ‌తిని రివీల్ చేసింది. బెడ్ రూమ్ లో ధోని నిద్ర‌కు సిద్ద‌మ‌వుతోన్న వేళ సాక్షి భ‌ర్త కాళ్ల‌ను ప‌డుతూ రిలాక్స్ చేస్తోంది. ప‌తియే ప్ర‌త్య‌క్ష దైవం అని చాటి చెప్పిన స‌న్నివేశ‌మ‌ది. ధోనీ ని మిస్ట‌ర్ స్వీటీ! అని సంబోధిస్తూ బెడ్ రూమ్ ప్రైవ‌సీ కి సంబంధించిన ఓ ఫోటోని అభిమానుల‌తో పంచుకుంది. ధోని మొత్త‌టి ప‌రుపుపై సేద ‌తీరుతుంటే చ‌టుక్క‌న సాక్షి ధోని కాళ్ల‌ను ఒడిలో వేసుకుని నొక్కుతోంది. కాళ్ల వేళ్ల‌ను జుర్రుతూ రొమాంటిక్ మూడ్ లోకి జారుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.