Begin typing your search above and press return to search.

సాక్షి కేజీన్నర రోల్డ్ గోల్డ్‌?

By:  Tupaki Desk   |   28 Sep 2018 2:30 PM GMT
సాక్షి కేజీన్నర రోల్డ్ గోల్డ్‌?
X
వ‌న్నెచిన్నెల రంగుల ప్ర‌పంచంలోకి ఎంద‌రో వ‌స్తుంటారు.. పోతుంటారు. కొంద‌రికి స్టార్‌ డ‌మ్ ఎంత ప్ర‌య‌త్నించినా చిక్క‌దు. మ‌రికొంద‌రికి చిక్కిన‌ట్టే చిక్కి ఎంచ‌క్కా మాయ‌మ‌వుతుంది. ఆ బాప‌తు క‌థానాయిక‌ల జాబితా ప‌రిశీలిస్తే మిడిల్ రేంజ్ స్టాండార్డ్స్‌లోనే రేసులో వెన‌క‌బ‌డింది సాక్షి చౌద‌రి. చూడ‌టానికి ఒడ్డు .. పొడ‌వు.. అందం.. గ్లామ‌ర్ ఎలివేష‌న్‌.. ఏ కోణంలో చూసినా త‌క్కువేం కాదు. అయితే స్టార్‌ డ‌మ్ అనేది ఆయాచితంగా ద‌క్కే వ‌రం కాద‌ని ఈ అమ్మ‌డి విష‌యంలో ప్రూవైంది. టాలీవుడ్‌ లో ప్ర‌వేశించి ఐదేళ్లు అయినా ఇంకా సాక్షి కెరీర్ ఆరంభ క‌ష్టాల్లోనే ఉంది.

సాక్షి ఇదివ‌ర‌కూ మంచు మ‌నోజ్ స‌ర‌స‌న `పోటుగాడు` చిత్రంలో న‌టించింది. ఆ సినిమాని - సాక్షిచౌద‌రి ప్ర‌తిభాపాఠ‌వాల్ని ల‌గ‌డ‌పాటి & మేక‌ర్స్ ఓ రేంజులో ప్ర‌మోట్ చేశారు. ప్యార్ మే ప‌డిపోయానే.. అంటూ సాక్షి చాలానే సంద‌డి చేసింది. ఆ ఒక్క పాట‌తో సాక్షికి చ‌క్క‌ని ఇమేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ `జేమ్స్‌ బాండ్‌` చిత్రంలో ఫుల్ లెంగ్త్ డాన్ పాత్ర‌లో అంతే మైమ‌రిపించింది. లేడీ డాన్‌గా ఆ చిత్రంలో రెసిడెంట్ ఈవిల్ క‌థానాయిక మిలా జోవిచ్ రేంజులో ఫైట్స్ చేసి మైమ‌రిపించింది. అయితే అంత ట్యాలెంట్ ఉన్నా ఎందుక‌నో సాక్షిని స‌రైన అవ‌కాశాలు వ‌రించిందే లేదు. హ‌న్సిక‌ - తాప్సీ .. ఆ త‌ర్వాత ఆ కోవ‌లోనే ఈ అమ్మ‌డు ఎందుక‌నో టాలీవుడ్‌ లో పెద్ద స్థాయికి ఎద‌గలేకపోయింది.

మ‌ర్చిపోతున్నారు అన‌గానే.. ఇదిగో `సువ‌ర్ణ సుంద‌రి` అంటూ ఓ ప్ర‌యోగాత్మ‌క హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ బ్యాక్‌ డ్రాప్ సినిమాతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ``సాహో సార్వ భౌమి`` అంటూ సాగే ఓ పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌లో సాక్షి చౌద‌రి ధ‌గ‌ధ‌గ‌లు యూత్‌ ని మైమ‌రిపిస్తున్నాయి. అలానే సాక్షి రాకుమారి గెట‌ప్ ఫోటోలు యూత్‌ ని ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెడ‌లో ధ‌రించిన కేజీన్నర గోల్డ్(రోల్డ్‌) ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌ లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ``చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొంది`` అన్న క్యాప్షన్ ఇచ్చారు. ఇదే చిత్రంతో చాలా కాలం త‌ర్వాత‌ ఎమ్‌.ఎల్‌.ల‌క్ష్మి తిరిగి నిర్మాత‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో జయప్రద, పూర్ణ, సాయికుమార్‌ - నాగినీడు - కోట శ్రీనివాసరావు లాంటి టాప్ కాస్టింగ్ న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ కానుంది.