Begin typing your search above and press return to search.

ఈ గ్లామర్ సాక్షిగా పిచ్చెక్కించిందిగా

By:  Tupaki Desk   |   7 July 2016 4:31 AM GMT
ఈ గ్లామర్ సాక్షిగా పిచ్చెక్కించిందిగా
X
అందంగా ఉండడం వేరు.. ఆ అందానికి ఆకర్షణ జత చేయడం వేరు.. అందరూ చేసేలా అందాల ప్రదర్శన చేయడం వేయడం వేరు. కానీ అన్ని లక్షణాలు ఒక దగ్గరే ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది హీరోయిన్ సాక్షి చౌదరి. టాలీవుడ్ లో మూడేళ్ల క్రితం అరంగేట్రం చేసిన ఈ భామ.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. మొదట మంచు మనోజ్ మూవీ పోటుగాడులో కనిపించిన సాక్షి.. ఆ తర్వాత అల్లరి నరేష్ తో జేమ్స్ బాండ్ మూవీలో మాఫియా డాన్ గా అదరగొట్టింది. ఓసారి బాలీవుడ్ ట్రిప్ వేసి.. ఇప్పుడు మళ్లీ అల్లరి నరేష్ తో కలిసి సెల్ఫీ రాజాలో సందడి చేయనుంది.

ప్రస్తుతం ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న సాక్షి చౌదరి.. గ్లామర్ ని ప్రదర్శించిన తీరు చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. మోకాళ్ల పైకి డ్రస్ వేసుకొచ్చిన ఈ సుందరాంగి క్లీవేజ్ షోని చూసి చూసినోళ్లు నోరెళ్ల బెట్టేశారు. టాలీవుడ్ లో గ్లామర్ ప్రదర్శనలు సాధారణమే అయినా.. ఇంత భారీ ఎక్స్ పోజింగ్ లు పెద్ద పెద్ద ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తాయి. కానీ ప్రమోషనల్ ఈవెంట్ లో ఈ రేంజ్ అందాల ఆరబోతతో అదరగొట్టేసింది సాక్షి చౌదరి. పైగా ఏ మాత్రం మొహమాటపడకుండా ఫోటోలకు అడిగినన్ని పోజులివ్వడం మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

ఈ గ్లామర్ సాక్షిగా చెప్పుకోవాలంటే.. అందాలను ప్రదర్శించడంలో సాక్షి చౌదరి చాలానే డిగ్రీలు చేసేసిందనే కామెంట్స్ వినిపించాయి. ఈ కుర్రది మాంచి పొడగరి కూడా కావడంతో.. బ్యూటీని బ్యూటీ చూపిస్తున్న అందాలను కెమేరాల్లో బంధించే అవకాశాన్ని ఎవరూ వదులుకోలేదు. ఈవెంట్ లోనే ఈ రేంజ్ ఎక్స్ పోజింగ్ అంటే.. మూవీల్లో అయితే మరెంత కోఆపరేషన్ ఇస్తుందో అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.