Begin typing your search above and press return to search.

గోవా బీచ్ లో చక్కర్లు కొడుతున్న బబ్లీ భామ!!

By:  Tupaki Desk   |   30 Dec 2020 1:30 AM GMT
గోవా బీచ్ లో చక్కర్లు కొడుతున్న బబ్లీ భామ!!
X
హీరోయిన్ సాక్షి అగర్వాల్.. అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ భామ మొదట మార్కెటింగ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసి ఆ తర్వాత యాక్టింగ్ రంగం వైపు అడుగులేసింది. మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడే సాక్షి మోడలింగ్ ప్రారంభించిందట. పుట్టింది నైనిటాల్ లో అయినా విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే ముగించింది. ఎంబీఏ కంప్లీట్ చేసాక మార్కెటింగ్ కన్సల్టెంట్ గా జాబ్ చేసే టైంలో మోడలింగ్, ఫ్యాషన్ షోస్ అంటూ మెల్లగా యాక్టింగ్ వైపు దృష్టి పెట్టింది. అలా కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసే టైంలో తమిళ రాజారాణి సినిమాలో ఛాన్స్ వచ్చిందట. తర్వాత 2014లో 'సాఫ్ట్వేర్ గంధ' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాల ఆఫర్స్ రావడంతో తమిళంలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

అలా తమిళంలో బిజీ ఉన్న సాక్షి.. 'ఒరాయిరామ్ కినక్కాలల్' అనే సినిమాతో మలయాళంలో అరంగేట్రం చేసింది. కానీ ఇంతవరకు సాక్షి తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం అమ్మడి చేతినిండా తమిళ సినిమాలు ఉన్నాయట. అవన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సాక్షికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే సినిమాలలో ఎంత ముద్దుగా చీర కట్టులో కనిపించినా మోడలింగ్, ఫోటో షూట్స్ విషయానికి వచ్చేసరికి అమ్మడి రూల్స్ అన్ని బ్రేక్ చేస్తోంది. బీచ్ లో బికినీ, నడుము వయ్యారాలు బాగానే నిర్మొహమాటంగా షో చేసేస్తూ కుర్రాళ్ల నిద్ర చెడగొడుతోంది. తాజాగా సాక్షి గోవా అంతా తన అందాలతో చుట్టేసినట్లుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ అండ్ వైట్ బబ్లీ డ్రెస్ లో సాక్షి.. కుర్ర ఎదలను దోచుకుంటుంది. అందమైన స్మైల్, అందమైన కళ్ళు ఇలా అన్ని అందాలతో నెట్టింట వైరల్ అవుతోంది భామ.