Begin typing your search above and press return to search.

ఇన్నేళ్లకు సంతోషంగా దివ్యభారతి తండ్రి

By:  Tupaki Desk   |   18 April 2018 12:09 PM IST
ఇన్నేళ్లకు సంతోషంగా దివ్యభారతి తండ్రి
X
దివ్యభారతి.. రెండున్నర దశాబ్దాల క్రితం ఓ సంచలనం. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించేసింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ అంతకంటే వేగంగా తనువు చాలించింది ఈ హీరోయిన్. దివ్యభారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి పెట్టిన కన్నీరు.. ఇప్పటికీ సినీ అభిమానులను వెంటాడుతూనే ఉంటుంది.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ ఆయనను ఎవరూ సంతోషంగా చూడలేదు. దివ్యభారతి చనిపోయి 25 ఏళ్లు అవుతున్న సమయంలో.. ఇపుడు ఓం ప్రకాష్ భారతి 80వ వసంతం వచ్చింది. ఈ వేడుకలను దివ్యభారతి భర్త సాజిద్ నడియడ్వాలా నిర్వహించారు. మామగారి 80వ పుట్టిన రోజు వేడుగలను గ్రాండ్ గా నిర్వహించాడు ఈ నిర్మాత. దివ్యభారతి మంచి క్రేజ్ లో ఉన్న సమయంలోనే.. అంటే 1992లోనే ఆమె పెళ్లి చేసుకుంది. తన హెయిర్ డ్రెసర్ సంధ్య.. ఆమె భర్త సాక్షులుగా వీరి వివాహం జరిగింది. కానీ ఈ పెళ్లి జరిగిన ఆరు నెలలకే దివ్యభారతి ఆత్మహత్య చేసుకుంది.

ఆ తర్వాత తమ పెళ్లి విషయాన్ని జనాలకు చెప్పాడు సాజిద్. అప్పట్లో ఆమె కెరియర్ కోసమే తమ పెళ్లి విషయాన్ని దాచి ఉంచామని అన్న ఈయన.. దివ్యభారతి మరణించిన 11 ఏళ్ల తర్వాత మరో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాతగా కొనసాగుతున్నా.. వేరే కుటుంబ ఉన్నా.. మొదటి భార్య తండ్రికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి.. అందరి మెప్పు పొందాడు సాజిద్.